హెచ్‌పీ 64జీబీ టచ్‌ప్యాడ్ రివ్యూ..

Posted By: Super

హెచ్‌పీ 64జీబీ టచ్‌ప్యాడ్ రివ్యూ..

హెవ్లెట్ ప్యాకర్డ్ (హెచ్ పీ) తాజా గాడ్జెట్ హెచ్‌పీ టచ్‌ప్యాడ్ రివ్యూకు సంబంధించిన పలు వివరాలు కంపెనీ ఫ్రంచ్ వెబ్‌సైట్లో విడుదల చేశారు. వెబ్‌సైట్లో పేర్కొన్న సమాచారం మేరకు ఏ డివైజ్‌లో లేనంత, 64 జీబీల మెమరీ సౌలభ్యతను హెచ్‌పీ టచ్‌ప్యాడ్‌లో పొందుపరిచారు. ఆధునిక హంగులతో విడుదల కాబోతున్న ఈ ‘టచ్‌‌ప్యాడ్’, యాపిల్ బ్రాండ్‌కు ధీటుగా నిలుస్తుందని అంచనాల ఊపందుకున్నాయి.

యాపిల్ ఐఫోన్‌కు పోటీగా రూపుదిద్దుకున్న ‘హెచ్‌పీ టచ్‌ప్యాడ్’ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతుందని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ టాబ్లెట్‌కు సంబంధించి స్పెసిఫికేషన్లను కంపెనీ వర్గాలు ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఈ టాబ్లెట్ పీసీకి సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచిన హెచ్‌పీ, వినియోగదారులను మరింత ఊరిస్తుంది.

ఈ టాబ్లెట్ పీసీలోని ప్రత్యేకతలను పరిశీలిస్తే 64జీబీ సామర్థ్యం వినియోగదారునికి మరింత లబ్థి చేకూరుస్తుంది. సినిమాలు, పాటలతో పాటు మంచి మంచి ఈ - పుస్తకాలను కూడా డివైజ్ స్టోరేజిలో భద్ర పరుచుకోవచ్చు. వేగవంతమైన 1.2 GHz క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ డ్యూయల్ కోర్ APQ8060 ప్రొసెసింగ్ వ్యవస్థను టచ్‌ప్యాడ్‌లో పొందుపరిచారు.

1.3 మెగా పిక్సల్ సామర్థ్యం కలిగిన ఫ్రండ్ కెమెరా నాణ్యమైన వీడియో ఛాటింగ్ అనుభూతిని వినియోగాదారునికి అందిస్తుంది. ఈ టచ్‌ప్యాడ్‌ కలిగి ఉన్న వెడల్పు స్ర్కీన్‌తో ఒకే సారి వీడియో చూడటంతో పాటు వెబ్ బ్రౌసింగ్ చేసుకోవచ్చు. నలుపు, తెలుపు రెండు రంగుల్లో ఈ గాడ్జెట్ విడుదలకానున్నట్లు సమాచారం.

ధృడమైన బ్యాటరీ వ్యవస్థ, పవర్ మేనిజిమెంట్, గేమింగ్ ఫెసిలిటీస్, బ్లూటూత్, వై - ఫై వంటి అంశాలను అత్యాధునిక సాంకేతికతతో రూపొందించారు. హెపీ 64 జీబీ టాబ్లెట్ పీసీ ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. అయితే ఈ ఏడాది చివర్లలో మార్కెట్లో విడుదల కావొచ్చని తెలుస్తోంది. అయితే దీని మార్కెట్ ధర రూ.28,000 ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot