కాల్స్ సదుపాయంతో హెచ్‌పీ 7 వాయిస్ ట్యాబ్

Posted By:

వాయిస్ కాలింగ్ సదుపాయంతో కూడిన హెచ్‌పీ 7 వాయిస్ ట్యాబ్‌ను ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ హెచ్‌పీ, ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. సింగిల్ మైక్రో సిమ్ కార్డ్‌స్లాట్ సదుపాయాన్ని కలిగి ఉన్న ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్ 3జీ వాయిస్ కాలింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ధర రూ.10990. హెచ్‌పీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రిటైలర్‌ల వద్ద ఈ ట్యాబ్ లభ్యమవుతోంది.

 కాల్స్ సదుపాయంతో హెచ్‌పీ 7 వాయిస్ ట్యాబ్

హెచ్‌పీ 7 వాయిస్ ట్యాబ్ ప్రధాన ఫీచర్లు:

6.95 అంగుళాల కెపాసిటివ్ మల్టీటచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ8382 ప్రాసెసర్,
500 మెగాహెట్జ్ మాలీ 400 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ),
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
టాబ్లెట్ బరువు 305 గ్రాములు, మందం 10.15 మిల్లీ మీటర్లు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
HP 7 VoiceTab with Voice Call Support, Android KitKat Launched for Rs 10,990. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot