HP Back to College sale : ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. అయితే ఈ ప్రత్యేక ఆఫర్ మీకోసమే..!
ప్రముఖ ల్యాప్‌టాప్ ల తయారీ సంస్థ HP కీలక ప్రకటన చేసింది. బ్యాక్ టూ కాలేజ్ లో భాగంగా తన ల్యాప్‌టాప్ మోడల్స్ పై డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ ఆఫర్లు ఉన్నాయి. ఈ సేల్ లో భాగంగా Omen, విక్టస్, OmniBook సిరీస్ ట్యాప్‌టాప్ లను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రత్యేక ఆఫర్ ఆగస్టు 20 2025 వరకు అందుబాటులో ఉంటుంది.
HP బ్యాక్ టూ కాలేజ్ సేల్ లో (HP Back to College sale ) భాగంగా హెచ్‌పీ వరల్డ్ స్టోర్స్, HP ఆన్‌లైన్ స్టోర్ సహా ఇతర అథరైజ్డ్ ఆఫ్‌లైన్ స్టోర్ లో కొనుగోలు చేసిన ఉత్పత్తులపై మాత్రమే డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ ఆఫర్ల వర్తిస్తాయి.

HP Omen సిరీస్ :
HP ప్రత్యేక సేల్‌లో భాగంగా Omen ల్యాప్‌టాప్ సిరీస్‌పై 2 సంవత్సరాల వారంటీని పొందవచ్చు. మరియు ఎక్స్ఛేంజీపై గరిష్ఠంగా రూ.15000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. దీంతోపాటు రూ.3499 విలువైన Protegent యాంటీ వైరస్ ప్యాకేజీని రూ.2499 కే సొంతం చేసుకోవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై నో కాస్ట్ EMI ఆప్షన్ ను పొందవచ్చు.
HP విక్టస్ సిరీస్ :
ఈ ఆఫర్ లో భాగంగా 2 సంవత్సరాల వారంటీని పొందవచ్చు. దీంతోపాటు రూ.2999 విలువైన Protegent యాంటీ వైరస్ ప్యాకేజీని రూ.1999 కే సొంతం చేసుకోవచ్చు. HP పాత ల్యాప్‌టాప్ లను ఎక్స్ఛేంజీ చేయడం ద్వారా గరిష్ఠంగా రూ.5000 డిస్కౌంట్ ను పొందవచ్చు. నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
HP OmniBook X, అల్ట్రా :
ఈ ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసే సమయంలో పాత HP ల్యాప్‌ట్యాప్ లను ఎక్స్ఛేంజీ చేయడం ద్వారా గరిష్ఠంగా రూ.15 వేల డిస్కౌంట్ ను పొందవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో గరిష్ఠంగా రూ.15000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
HP OmniBook X లేదా అల్ట్రా మోడల్స్ కొనుగోళ్లపై 2 సంవత్సరాల వారంటీని కూడా అందిస్తుంది. దీంతోపాటు 3 సంవత్సరాల వ్యాలిడిటీ కలిగిన Protegent యాంటీ వైరస్ ప్యాకేజీ రూ.3499 కే కొనుగోలు చేయవచ్చు. విద్యార్థులకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి.

HP OmniBook 5, 7 ఆఫర్లు :
ఈ రెండు మోడల్స్ కొనుగోలు సమయంలో ఎంపిక చేసిన బ్యాంకుల కార్డులతో గరిష్ఠంగా రూ.15000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. దీంతోపాటు HP పాత ల్యాప్‌టాప్ లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా గరిష్ఠంగా రూ.5 వేల ప్రయోజనం పొందవచ్చు.
దీంతోపాటు మరో సూపర్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. రూ.20000 విలువైన Adobe ఫోటోషాప్ ఎలిమెంట్స్ మరియు ప్రీమియర్ ఎలిమెంట్స్ సాఫ్ట్‌వేర్ ను కేవలం రూ.2999 కే సొంతం చేసుకోవచ్చు. Omen, OmniBook, విక్టస్ మోడల్స్ పైన మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీంతోపాటు రూ.4899 విలువైన మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సబ్‌స్క్రిప్షన్‌ను కేవలం రూ.999 కే సొంతం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








