‘హెచ్‌పీ’ స్పెషల్ ఎడిషిన్ నోట్‌బుక్ మహిళలకు ప్రత్యేకం.!!

‘హెచ్‌పీ’ సరికొత్త ఫ్యాషన్ డిజైన్‌తో రూపుదిద్దుకోనున్న ల్యాపీ పరికరాలను ఇక మీదట వినియోగదారులకు అందించనుంది.
ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థ కొత్తదనంతో పాటు ఆధునిక సాంకేతికత మేళవింపుతో రూపుదిద్దుకుంటున్న స్పెషల్ ఎడిషన్ నోటుబక్ పై ఇప్పిటికే మార్కెట్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకున్నాయి. నోట్‌బుక్ డిజైనింగ్ విషయంలో కీలక దృష్టిసారించిన ‘వివిన్నీ ట్యామ్’ బృందం అన్ని వర్గాల వినియోగదారులను దృష్టిలో ఉంచుకని ఈ నోటుబుక్‌లను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఫ్యాషన్ డిజైనింగ్ పై అత్యధికంగా మక్కువ చూపే మహిళలను మరింత ఆకర్షించే విధంగా ‘స్పెషల్ ఎడిషన్ నోట్ బుక్’ను తీర్చిదిద్దారట. ఆధునిక ఫ్యాషన్ మెరుగులతో పాటు, అత్యాధునిక సాంకేతిక పరిజానాన్ని ఈ నోట్‌బుక్‌లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఆసియా దేశాల సంస్కృతితో పాటు పాశ్చాత్య ఖండాల సంస్కృతిని ల్యాపీ పరికరాల్లో పొందుపరిచినట్లు వివిన్నీ ట్యామ్ సంస్థ పేర్కొంది.


Click it and Unblock the Notifications