గజదొంగల వల్ల కూడా కాదు..!!

Posted By: Super

గజదొంగల వల్ల కూడా కాదు..!!

‘‘ప్రఖ్యాత సాంకేతిక వస్తు తయారీదారు హెచ్‌పీ (HP) ‘కాంపాక్ 8200 ఎలైట్ (Compaq 8200 Elite) పేరుతో డెస్క్‌టాప్ పీసీని మార్కెట్లో విడుదల చేయుబోతున్నారు. ఈ పీసీలో పొందుపరిచిన ‘ఇంటెలిజంట్ సెక్యూరిటీ వ్యవస్థ’ మీ డేటాకు రక్షణ కవచంలా నిలుస్తుంది. ఒక వేళ మీ పీసీని హ్యాకింగ్ దొంగలు ఎత్తికెళ్లినా అందులో డేటాను తెలుసుకోవటం వారికి సాధ్యం కాదు. ’’

అత్యాధునిక హంగులను తనలో అమర్చుకుని జనంలోకి రాబోతుందో ‘సాంకేతిక పరికరం’.. ప్రఖ్యాత తయారీ సంస్థ హెచ్‌పీ ‘కాంపాక్ 8200 ఎలైట్’ పేరుతో డెస్క్‌టాప్ పీసీని మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ గ్యాడ్జెటలో పొందుపిరిచన అధునాతన కాన్ఫిగరేషన్ వ్యవస్థ, ప్రస్తుతం నడుస్తున్న అన్ని డెస్క్‌టాప్ ఆప్లికేషన్లను సహకరిస్తుంది.

చూడగానే సాధారణ లుక్‌తో కనిపించే ‘కాంపాక్ 8200 ఎలైట్’, ఫీచర్ల విషయానికి వస్తే మాత్రం దుమ్ము రేపుతుంది. పొందుపరిచిన సెకండ్ జనరేషన్ ఇంటల్‌కోర్ ప్రొసెసర్ సమర్థవంతమైన లక్షణాలను ఒదిగి ఉంది. పీసీలో ఏర్పాటు చేసిన vPro వ్యవస్థ ఎడ్మిన్ పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఇక భద్రత విషయానికి వస్తే పీసీలో ప్రవేశపెట్టిన ఇంటెలిజంట్ సెక్యూరిటీ వ్యవస్థ మీరు దాచుకున్న‘రహస్యమైన డేటాకు’ రక్షణ కవచంలా నిలుస్తుంది. రిమోట్ ఆపడేటింగ్ వ్యవస్థ ఈ పీసీకి మరో అదనం.

23 అంగుళాల స్ర్కీన్ సైజు కలిగిన ‘కాంపాక్ 8200 ఎలైట్’ హెచ్‌డీ నాణ్యత కలిగి ఉంటుంది. 1920 X 1080 పిక్సల్ నాణ్యత కలిగిన HD WLED ఎల్ సీడీ మోనిటర్ డెస్క్‌టాప్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతుంది. హై కాన్ఫిగరేషన్ కలిగిన ఇంటెల్ కోర్ i7 – 2600 2.80 GHz ప్రొసెసర్, 8 జీబీ సామర్ధ్యం గల ర్యామ్, 160 జీబీ సామర్ధ్యం గల హార్డ్ డ్రైవ్, ఇంటెల్ హెచ్‌డీ గ్రాఫిక్ వ్యవస్థలు వినియోగదారునికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.

పొందుపరిచిన 1.3 మెగా పిక్సల్ వెబ్ కెమెరా, మైక్రో ఫోన్, హెడ్ ఫోన్ వంటి అంశాలు మరింత ఉపయుక్తంగా పనిచేస్తాయి. 2.0 వర్షన్లకు సంబంధించిన 6 యూఎస్‌బీ పోర్టులను పీసీలో అమర్చారు. ‘కాంపాక్ 8200 ఎలైట్’ పీసీలో 6 ఇన్ 1 కార్డ్ రీడర్, మినీ PCIe x slot, వై - ఫై వంటి అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇన్ని సౌలభ్యాలున్న ‘హెచ్‌పీ’ ఆల్ ఇన్ వన్ పీసీ భారతీయ మార్కెట్లో రూ. 45644కు లభిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot