మెగాస్టార్‌తో పోటీపడుతున్న యువసామ్రాట్!!

Posted By: Super

మెగాస్టార్‌తో పోటీపడుతున్న యువసామ్రాట్!!


అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజాల మధ్య ఆధిపత్య పోరు కోనసాగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మెగస్టార్ హోదాలో దూకుడుమీదున్న‘ఆపిల్’కు, యువసామ్రాట్ రేంజ్‌లో దూసుకొస్తున్న హెచ్‌పీ(HP) చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తుంది. ఆపిల్ ‘మ్యాక్ బుక్’ జోరును అడ్డుకునే ప్రయత్నంలో ‘హెచ్‌పీ’ ధీటైన ఫీచర్లతో ‘ఎలైట్ బుక్ 2560’ గ్యాడ్జెట్‌ను విడుదల చేసింది.

క్లుప్తంగా వీటి ఫీచర్లు, వృత్యాసాలు:

- ‘ఎలైట్‌బుక్ 2560’, 1.08 అంగుళాల మందపు ధారుడ్యం కలిగి, 3.7 పౌండ్ల బరువుతో డిజైన్ చేయుబడింది. ఆపిల్ మ్యాక్‌బుక్, 0.68 అంగుళాల మందుపు శరీరంతో కేవలం 2.4 పౌండ్ల బరువుతో రూపుదిద్దుకుంది. ఈ
అల్ట్రాబుక్‌ల చాసిస్ నిర్మాణంలో భాగంగా ‘ఆల్యూమినియం’ను ఉపయోగించారు.

- ప్రొసెసింగ్ అంశాలను పరిశీలిస్తే, ఎలైట్‌బుక్ ‘కోర్ i5 సాండీ బ్రిడ్జ్ 2410M 2.3 GHz ప్రొసెసర్’ను కలిగి ఉండగా, మ్యాక్‌బక్ ‘ఇంటెల్ కోర్ 2 ULV 1.6GHz ప్రొసెస్సింగ్ వ్యవస్థ’తో తయారు కాబడింది.

- వీటి స్ర్కీన్ ఫీచర్లను పరిశీలిస్తే, ఎలైట్‌బుక్ 12.5 అంగుళాల మ్యాటీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మ్యాక్‌బుక్ 11.6 అంగుళాల స్లిమ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

- ఎలైట్‌బుక్‌లో పొందుపరిచిన ‘3జీ టెక్నాలజీ’ వ్యవస్థ, ప్రయాణ సందర్భాల్లో వేగవంతంగా పని చేస్తుంది.

- ఎలైట్‌బుక్‌లో రూపొందించిన ఆప్టికల్ డ్రైవ్ వ్యవస్థలు, మ్యాక్‌బుక్‌లో లోపించాయి.

- రెండు ల్యాపీల ‘కీబోర్డులు’ సులువైన టైపింగ్‌కు ఉపకరిస్తాయి.

- 8 గంటల బ్యాటరీ బ్యాకప్ సామర్థ్యాన్ని గ్యాడ్జెట్లు కలిగి ఉంటాయి.

- టచ్‌ప్యాడ్ విషయంలో మ్యాక్ బుక్, హెచ్‌పీ ఎలైట్‌ను డామినేట్ చేస్తుంది. మ్యాక్‌బుక్ టచ్‌ప్యాడ్‌లో పొందుపరిచిన ‘మల్టీ గెస్ట్యుర్’ టెక్నాలజీ బ్రౌజింగ్ విషయంలో మరింత వేగవంతంగా స్పందిస్తుంది.

- డాకింగ్ స్టేషన్ వ్యవస్థ ఆపిల్ మ్యాక్‌బుక్‌లో లోపించింది.

- ఎలైట్‌బుక్ ‘320 జీబీ HDD’ వ్యవస్థను కలిగి ఉండగా, ఆపిల్ మ్యాక్‌బుక్ పటిష్టమైన ‘128 GB SSD’ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ రెండు అల్ట్రాబుక్ పరికరాలలో 4జీబీ ర్యామ్ వ్యవస్థలను ప్రతిష్టించారు.

- ఇండియన్ మార్కెట్లో వీటి ధరలను పరిశీలిస్తే ‘హెచ్‌పీ ఎలైట్‌బుక్ 2560p’ రూ.54,000కు లభ్యమవుతుండగా, ఆపిల్ మ్యాక్‌బుక్ రూ.62,000లకు అందుబాటులో ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot