హెచ్‌పీ ఆశలు హిట్టా..? ఫట్టా..?

Posted By: Prashanth

 

హెచ్‌పీ ఆశలు హిట్టా..? ఫట్టా..?

 

ల్యాప్‌టాప్ కోనుగోలు చేద్దామన్న ఆలోచన మదిలో తొలవగానే టక్కున గుర్తుకు వచ్చే బ్రాండ్ హెచ్‌పీ (HP), ఇందుకు కారణం బ్రాండ్‌కు మార్కెట్లో ఉన్న ఇమేజ్. క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడని హెచ్‌పీ వినియోగదారుడి నమ్మకానికి పూర్తి స్థాయి భరోసాను కల్పిస్తుంది.

తాజాగా ఈ అంతర్జాతీయ బ్రాండ్ కోటి ఆశలతో కొత్త వర్షన్ ల్యాప్‌టాప్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ‘హెచ్‌పీ ఎన్వీ 15’ మోడల్‌లో డిజైన్ కాబడిన ఈ ల్యాపీ శక్తివంతమైన ప్రాసెసింగ్ వ్యవస్థతో పాటు మెరుగైన విజువల్స్‌ను విడుదల చేసే గ్రాఫిక్ కార్డ్‌తో పటిష్టంగా రూపుదిద్దుకుంది.

మైక్రోసాఫ్ట్ విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా పనిచేసే ‘హెచ్‌పీ ఎన్వీ 15’ ముఖ్య ఫీచర్లు:

* ఇంటెల్ కోర్ i5 2430M 2.4 GHz మొబైల్ ప్రాసెసర్, * టర్బో బూస్ట్, * AMD రాడియన్ హై డెఫినిషన్ గ్రాఫిక్ యాక్సిలరేటర్ యూనిట్, * 6 జీబి ర్యామ్, * 500 జీబి హార్డ్ డిస్క్, * 15.6 అంగుళాల హై డెఫినిషన్ డిస్ ప్లే, * సూపర్ మల్టీ 8X డివీడీ డబుల్ లేయర్ సపోర్ట్, * హెచ్‌పీ ట్రూ విజన్ వెబ్‌క్యామ్, * బ్లూటూత్ కనెక్టువిటీ, * ఇంటెల్ 802.11 a/b/g/n WLAN, * సౌకర్యవంతమై టైపింగ్‌కు రేడియంట్ బ్యాక్ లిట్ కీబోర్డ్, * పటిష్టమైన బ్యాకప్ నిచ్చే బ్యాటరీ, * ఆడోబ్ ఫోటో షాప్.

మల్టీ మీడియా అవసరాలకు ‘హెచ్‌పీ ఎన్వీ’ పూర్తి స్థాయిలో దోహదపడుతుంది. స్మూత్ టచ్‌ప్యాడ్ సౌకర్యవంతమైన కంప్యూటింగ్‌కు దోహదపడుతుంది. ఏర్పాటు చేసిన డాక్టర్ బీట్స్ ఆడియో వ్యవస్థ ఆడియోను వినసొంపైన బాణిలో అందిస్తుంది. డివైజ్ శక్తివంతమైన సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ పై రన్ అవుతున్న నేపధ్యంలో త్వరగా హీట్ ప్రొడ్యూస్ చేస్తుందని రివ్యూలు హెచ్చరిస్తున్నాయి. బ్యాటరీ సామర్ధ్యం కాస్తంత అసంతృప్తికి లోను చేస్తుంది. ఇండియన్ మార్కెట్లో ‘హెచ్‌పీ ఎన్వీ 15’ధర రూ.90,000 రెండు సంవత్సాల వారంటితో.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot