చైనాకే ఆ ఛాన్స్..?

Posted By: Prashanth

చైనాకే ఆ ఛాన్స్..?

 

కంప్యూటర్ల తయారీ సంస్థ హెచ్‌పీ తాజా నిర్ణయం చైనా యూజర్లకు సంతోషం కలిగిస్తుంది. ఈ అంతర్జాతీయ బ్రాండ్ తాజాగా డిజైన్ చేసిన శక్తివంతమైన ల్యాప్‌టాప్ ‘ఎన్వీ 4-1021tx’ను ముందుగా బుక్ చేసుకునే సౌలభ్యత చైనా వాసులకు దక్కింది. కంప్యూటింగ్ అదేవిధంగా కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంలో ఈ గ్యాడ్జెట్ క్రీయాశీలకంగా వ్యవహరిస్తుంది. ఈ డివైజ్‌కు సంబంధించి బహిర్గతమైన పలు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఫీచర్లను తెలుసుకుందాం...

14 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్ (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),

1.60గిగాహెడ్జ్ ఇంటెల్ కోర్ ఐ5-2468ఎమ్ ప్రాసెసర్,

ఏఎమ్‌డి రాడియన్ గ్రాఫిక్స్,

ఇంటెల్ హెచ్ఎమ్77 ఎక్స్‌ప్రెస్ చిప్‌సెట్,

బరువు 3.85ల్యాబ్స్,

మందం 0.78ఎమ్ఎమ్,

4జీబి ర్యామ్,

500జీబి సాటా హార్డ్‌డ్రైవ్,

యూఎస్బీ కనెక్టువిటీ,

హెచ్‌డిఎమ్‌ఐ పోర్టు,

ఆర్‌జే 5 పోర్టు,

మైక్రోఫోన్ ఇన్‌పుట్,

ఎస్డీ కార్డ్ రీడర్,

వై-ఫై.

ఈ సరికొత్త అల్ట్రాబుక్‌ను ‘స్లీక్ బుక్’గా బ్రాండ్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. షైనీ సిల్వర్ కలర్ వేరియంట్‌లో ఈ స్టీక్‌బుక్‌ను డిజైన్ చేశారు. ఉత్తమ క్వాలిటీ కంప్యూటింగ్‌ను ఈ డివైజ్ నుంచి ఆశించవచ్చు. ముఖ్యంగా నేటి యువతకు కావల్సిన అన్ని అంశాలను ఈ గ్యాడ్జెట్‌లో నిక్షిప్తం చేశారు. ల్యాపీలో ఏర్పాటు చేసిన 4 సెల్ బ్యాటరీ వ్యవస్థ 8 గంటల సుదీర్ఘ బ్యాకప్‌నిస్తుంది. ధర అంచనా రూ.50,000. ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమచారం తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot