దమ్మున్న ల్యాప్‌టాప్.. మీ కంప్యూటింగ్ మరింత ఈజీ!

Posted By: Prashanth

దమ్మున్న ల్యాప్‌టాప్.. మీ కంప్యూటింగ్ మరింత ఈజీ!

 

ప్రముఖ కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌ల నిర్మాణ సంస్థ హెచ్‌పీ, ‘ఎన్వీ 4-1037TX’ పేరుతో ఇంటెల్ ప్రాసెసర్ ఆధారితంగా పనిచేసే అల్ట్రాబుక్‌ను ఇటీవల ప్రకటించింది. స్టాండర్డ్ క్వాలిటీ ఫీచర్లను ఒదిగి ఉన్న ఈ కంప్యూటింగ్ సాధనం చక్కటి పనితీరును ప్రదర్శిస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. ల్యాపీ ప్రధాన ఫీచర్లు... 14 అంగుళాల ఎల్‌ఈడి బాక్‌లిట్ డిస్‌ప్లే, 1.7గిగాహెట్జ్ ఇంటెల్ కోర్ i5-3317U ప్రాసెసర్, ఇంటెల్ హెచ్‌ఎమ్77 ఎక్స్‌ప్రెస్ చిప్‌సెట్, విండోస్ 7 హోమ్ బేసిక్ ఆపరేటింగ్ సిస్టం, 4జీబి డీడీఆర్3 ఇంటర్నల్ మెమెరీ, 500జీబి సాటా హార్డ్‌డిస్క్ డ్రైవ్, 0.3 మెగాపిక్సల్ వెబ్‌క్యామ్, ఎస్డీ మెమెరీ కార్డ్‌స్లాట్, బరువు 1.75 కిలో గ్రాములు, 4సెల్ లితియమ్ బ్యాటరీ, ధర అంచనా రూ.52,000.

‘ఎన్వీ ఆల్ట్రాబుక్’, ‘ఎన్వీ స్లీక్‌బుక్’

ప్రముఖ పర్సనల్ కంప్యూటర్స్, ల్యాప్‌టాప్‌ నిర్మాణ సంస్థ హ్యూలెట్ ప్యాకార్డ్ (హెచ్‌పీ) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన, తేలికైన అతి పల్చని నోట్‌బుక్‌లను ఇండియాలో విడుదల చేసింది. ‘ఎన్వీ ఆల్ట్రాబుక్’, ‘ఎన్వీ స్లీక్‌బుక్’ పేరుతో విడుదల చేసిన ఈ నోట్‌బుక్‌ల ప్రారంభ ధరలు వరుసగా రూ.57,990, రూ.41,990. తేలిగ్గా, నాజూగ్గా ఉండే ఈ నోట్‌బుక్‌లలో మూడవ జనరేషన్‌కు చెందిన ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌ను వినియోగించారు. సాధారణ నోట్‌బుక్‌ల కంటే తొందరగా అంటే 15 సెకన్లలోనే బూట్ అవడం, బరువు 1.7 కేజీలు, మందం కేవలం 0.78 అంగుళాలు, బ్యాటరీ బ్యాకప్ 8 గంటలు ఉండటం ఈ నోట్‌బుక్స్‌లోని ప్రధాన ఆకర్షణలు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot