‘హెచ్‌పీ’ విశ్వాసాన్ని బలపరుస్తుందెవరు..?

అసస్, లెనోవో వంటి లీడింగ్ ల్యాప్‌టాప్ తయారీ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని సమర్ధవంతంగా ఎదుర్కొంటూ మార్కెట్లో తన స్థానాన్ని సుస్థిరపరచుకుంటున్న ‘హెచ్‌పీ’ ధృడ సంకల్పంలో ముందుకు సాగుతోంది. తాజాగా హెచ్‌పీ నుంచి ఎన్వీ సిరీస్‌లో విడుదలైన ‘డిఎమ్ 4 3022TX’ ల్యాప్‌టాప్ శక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉన్నట్లు రివ్యూల ద్వారా వెల్లడవుతుంది.
భారీ అంచనాల మధ్య విడుదలైన ‘హెచ్‌పీ ఎన్వీ DM4 3022TX’ కీలక ఫీచర్లను పరిశీలిద్దాం:
* 14 అంగుళాల బ్యాక్ లిట్ డిస్‌ప్లే, *మైక్రోసాఫ్ట్ విండోస్ 7 ప్రీమియమ్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం, * ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్, * 6జీబి ర్యామ్, * 640జీబి సాటా హార్డ్‌డిస్క్ డ్రైవ్, * 1జీబి హై డెఫినిషన్ గ్రాఫిక్ యూనిట్, * హెచ్‌పీ ట్రూ విజన్ హై డెఫినిషన్ వెబ్‌క్యామ్, * ఇంటిగ్రేటెడ్ డిజిటల్ మైక్రో ఫోన్, * మల్టీ ఫార్మాట్‌లను సపోర్ట్ చేస్తే డిజిటల్ మీడియా కార్డ్ రీడర్, * సూపర్ మల్టీ డివీడీ, * జిగాబిట్ ఇతర్‌నెట్ ల్యాన్ పోర్ట్, * యూఎస్బీ కనెక్టువిటీ, * హెచ్డీఎమ్ఐ పోర్ట్, * వై-ఫై ఇంటర్నెట్ కనెక్టువిటీ, * హై స్పీడ్ బ్లూటూత్, * పవర్ - ఆన్ పాస్‌వర్డ్, * 90వాట్ ఏసీ పవర్ ఆడాప్టర్, కెన్సింగ్‌టన్ మైక్రో సేవర్ లాక్ స్లాట్,
ల్యాపీలో అమర్చిన ఇంటెల్ ప్రాసెసర్ అదేవిధంగా గ్రాఫిక్ యాక్సిలరేటింగ్ వ్యవస్థలు పని వేగాన్ని మరింత పెంచుతాయి. కనెక్టువిటీ వ్యవస్థలైన వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీలు సమాచారాన్ని రెప్పపాటులో చేరవేస్తాయి. డివైజ్ స్ర్కీన్ విషయంలో స్వల్ప అసంతృప్తి వ్యక్తమవుతున్నప్పటికి పని తీరు విషయంలో ఏ మాత్రం నిరుత్సహానికి గురు చేయదు, డివైజ్‌లో ఏర్పాటు చేసిన కెన్సింగ్‌టన్ మైక్రో సేవర్ లాక్ స్లాట్ అదే విధంగా పవర్ - ఆన్ పాస్‌వర్డ్ అప్లికేషన్‌లు సెక్యూరిటీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి. భారతీయ మార్కెట్లో ‘హెచ్‌పీ డిఎమ్ 4 3022TX’ ధర రూ.50,000గా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








