‘ఆపిల్’ను ఢీ కొట్టేందుకు హెచ్‌పీ తహ తహ..!!

Posted By: Staff

‘ఆపిల్’ను ఢీ కొట్టేందుకు హెచ్‌పీ తహ తహ..!!


‘‘పోయిన హిరో స్థానాన్ని తిరిగి దక్కించుకునే ప్రయత్నంలో ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీ బ్రాండ్ ‘హెచ్ పీ’ (HP) మరో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. వినియోగదారులను మొప్పించటంలో ఇటీవల ఫేలవమైన ప్రదర్శనను కనబర్చిన ఈ బ్రాండ్ సరికొత్త ఆధునిక సాంకేతికతతో బరిలోకి దిగనుంది. ‘హెచ్‌పీ ఎన్వీ’ (HP Envy) పేరుతో సరికొత్త ల్యాపీ పరికరాన్ని మార్కెట్లో విడదుల చేసి ‘ఆపిల్ మ్యాక్ బుక్ ప్రో’కు ధీటుగా నిలువనుంది.’’

ఫీచర్లను క్లుప్తంగా పరిశీలిస్తే:

విండోస్ 7 ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా పనిచేసే ఈ సరికొత్త ల్యాపీలో ఇంటెల్ కోర్ i5 – 2410m ప్రొసెసింగ్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. 14.5 అంగుళాల డిస్‌ప్లే సామర్ధ్యం బ్రైట్ వ్యూ ఎల్‌ఈడీ డిస్‌ప్లే, AMD Radeon 6630 హై డెఫినిషన్ గ్రాఫిక్ వ్యవస్థ 6 GB DDR3 ర్యామ్, 500 GB హార్డ్ డ్రైవ్ తదితర అంశాలు వినియోగాదారునికి మరింత లబ్థి చేకూరుస్తాయి.

ఏర్పాటు చేసిన హై బేటాస్ ఆడియో, హెచ్‌పీ ట్రూ వర్షన్ ఆప్లికేషన్లు మల్టీమీడియా వ్యవస్థను పటిష్టతం చేస్తాయి. 802.11 b/g/n వై - ఫైతో పాటు అధునాతన బ్లూటూత్ వర్షన్ డేటా ట్రాన్స్‌ఫర్‌ను వేగవంతం చేస్తుంది. పొందుపరిచిన 3 యూఎస్బీ పోర్టులు ఎక్స్‌టర్నల్ హార్డ్‌వేర వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తాయి. హెచ్‌డి‌ఎమ్‌ఐ పోర్టు ద్వారా టీవీతో పాటు ప్రొజెక్టర్‌కు అనుసంధానం చేసుకోవచ్చు.

ఆప్టికల్ డ్రైవ్, ఫుల్ సైజు కీబోర్డు, టచ్‌ప్యాడ్ వంటి అంశాలు వినియోగదారునికి మరింత సౌలభ్యతను కల్పిస్తాయి. నాణ్యమైన బ్యాటరీ వ్యవస్థ 5 గంటల పాటు నిర్విరామంగా పనిచేస్తుంది. వివిధ వేరియంట్లలో లభ్యమవుతున్న ‘హెచ్‌పీ ఎన్వీ’ ల్యాపీ ధరలు రూ. 48,555 నుంచి ప్రారంభమవుతున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting