HP నుంచి కొత్త ల్యాప్‌టాప్ విడుదల.. మైక్రోసాఫ్ట్ కోపైలెట్ సహా 10:30 గంటల బ్యాటరీ బ్యాకప్..!
ప్రముఖ ల్యాప్‌టాప్‌ల తయారీ సంస్థ HP.. తన X360 సిరీస్‌ను క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా ఈ సంస్థ HP Envy X360 14 ను విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్ 14 అంగుళాల OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11 తో సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మైక్రోసాఫ్ట్ కోపైలెట్ బటన్‌ను లాంచ్ అయింది.
HP ఎన్వీ x360 14 స్పెసిఫికేషన్లు :
ఈ హెచ్‌పీ ల్యాప్‌టాప్ విండోస్ 11 హోమ్ OS పైన పనిచేస్తుంది. మరియు ఈ ల్యాప్ 2800*1800 పిక్సల్ 14 అంగుళాల OLED టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 48Hz నుంచి 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. డిజైన్ పరంగానూ ఆకట్టుకొనేలా ఉంది.

ఈ హెచ్‌పీ ల్యా్ప్‌టాప్ ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 16GB LPDDR5 ర్యామ్ మరియు 1TB NVMe M.2 SSD స్టోరేజీతో జతచేయబడుతుంది. దీంతోపాటు వైఫై 7 మరియు బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ ఫీచర్లు సహా USB-A, రెండు USB-C మరియు HDMI 2.1 పోర్టు సహా 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంటుంది.
కెమెరా సహా ఇతర వివరాలు :
హెచ్‌పీ సంస్థ ప్రకారం ఈ కొత్త ల్యాప్‌టాప్ 5MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా HDR సపోర్టు మరియు నాయిస్ ను కూడా తగ్గిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ డ్యూయల్ array డిజిటల్ మైక్రోఫోన్లు మరియు రెండు పోలీ స్డూడియో ఆధారిత రెండు స్పీకర్లను కలిగి ఉంటుంది.
సింగిల్ ఛార్జింగ్‌తో 10.30 బ్యాటరీ బ్యాకప్ :
ఈ HP Envy x360 14 ల్యాప్‌టాప్ 3 సెల్ 59Whr బ్యాటరీని కలిగి ఉంటుంది. 65W USB-C ఛార్జింగ్ సపోర్టుతో కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేయవచ్చని సంస్థ చెబుతోంది. మరియు పూర్తి ఛార్జింగ్‌తో 10 గంటల 30 నిమిషాలపాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని సంస్థ తెలిపింది.
హెచ్‌పీ ల్యాప్‌టాప్ ధర :
హెచ్‌పీ ఎన్వీ X360 14 ల్యాప్‌టాప్ అట్మాస్పియరిక్ బ్లూ మరియు మెటీరియర్ సిల్వర్ రెండు రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ కొత్త ల్యాప్‌టాప్ ధర రూ.99,999 గా ఉంది. HP ఆన్‌లైన్ స్టోర్, HP వరల్డ్ స్టోర్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్ కొనుగోలుపై ఓ బ్యాగ్‌ను ఉచితంగా పొందవచ్చని సంస్థ తెలిపింది.
ఈ HP Envy x360 14 ల్యాప్‌టాప్ ను ఇతర ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలు, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌లోనూ కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. ఈ ల్యాప్‌టాప్ ర్యామ్, స్టోరేజీ వేరియంట్ల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ ల్యా్ప్‌టాప్ యాక్సెలిరోమీటర్, గైరోస్కోప్, ఐఆర్ థర్మల్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. మరియు 1.39 కేజీల బరువు ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








