హెచ్‌పీ చతికిలపడిందా..?

Posted By: Prashanth

హెచ్‌పీ చతికిలపడిందా..?

 

అత్యధిక వినియోగదారులచే విశ్వసనీయ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న హెచ్‌పీ తాజా ఆవిష్కరణ నిరుత్సహానికి గురి చేసినట్లు తెలుస్తోంది. బ్రాండ్ ఇటీవల విడుదల చేసిన హెచ్‌పీ ఫోలియో 13-1008tu అల్ర్టాబుక్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

మిడ్ లెవల్ అల్ర్టా‌బుక్‌గా విడుదలైన ఈ కంప్యూటింగ్ డివైజ్‌‌ లో వోల్టేజ్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ కలిగి కేవలం 4జీబి ర్యామ్ పైన రన్ అవుతుంది. ఇటీవల కాలంలో విడుదలవుతున్న అల్ట్ర్రాబుక్ ల్యాపీలు శక్తివంతమైన ప్రాసెసర్ అదేవిధంగా అధిక సామర్ధ్యం గల ర్యామ్ పై రన్ అవుతున్న విషయాలను చూస్తున్నాం.

హెచ్‌పీ ఫోలియో 13-1008tu ముఖ్య ఫీచర్లు:

* విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టం, * 1.6GHz ఇంటెల్ కోర్ సెకండ్ జనరేషన్ ప్రాసెసర్, * 4జీబి ర్యామ్, * ఇంటెల్ హై డెఫినిషన్ గ్రాఫిక్ వ్యవస్థ, * 128జీబి సాలిడ్ స్టేట్‌డ్రైవ్, * స్ర్కీన్ సామర్ధ్యం 13.3 అంగుళాలు, * జిగాబిట్ ఇతర్ నెట్ పోర్ట్, * హెచ్డీఎమ్ఐ పోర్ట్, * యూఎస్బీ 3.0/2.0 పోర్ట్, * 802.11 b/g/n వై-ఫై కనెక్టువిటీ, * స్మూత్ టచ్ ప్యాడ్, * ల్యాపీ బరువు 1.5 కిలో గ్రాములు.

నిరుత్సాహా పరిచే అంశాలు:

* తక్కువ స్టోరేజి మెమరీ, * తక్కువ సంఖ్యలో యూఎస్బీ పోర్ట్స్, * తక్కువ సామర్ధ్యం గల జీపీయూ మెమెరీ.

సరాసరి (యావరేజ్) పనితీరు కనబర్చే ‘హెచ్‌పీ ఫోలియో 13-1008tu’ అల్ర్టాబుక్ ఇండియన్ మార్కెట్లో ఖచ్చితమైన ధర రూ.75,000. నెగిటివ్ టాక్ తెచ్చుకున్న నేపధ్యంలో ఈ ధర దిగివచ్చే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot