హెచ్‌పీ నాజూకు శ్రేణి నోట్‌బుక్‌లు!!

Posted By: Prashanth

హెచ్‌పీ నాజూకు శ్రేణి నోట్‌బుక్‌లు!!

 

ప్రముఖ పర్సనల్ కంప్యూటర్స్, ల్యాప్‌టాప్‌ నిర్మాణ సంస్థ హ్యూలెట్ ప్యాకార్డ్ (హెచ్‌పీ) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన, తేలికైన అతి పల్చని నోట్ బుక్ లను ఇండియాలో విడుదల చేసింది. ‘ఎన్వీ ఆల్ట్రాబుక్’, ‘ఎన్వీ స్లీక్‌బుక్’ పేరుతో విడుదల చేసిన ఈ నోట్‌బుక్‌ల ప్రారంభ ధరలు వరుసగా రూ.57,990, రూ.41,990. తేలిగ్గా, నాజూగ్గా ఉండే ఈ నోట్‌బుక్‌లలో మూడవ జనరేషన్ కు చెందిన ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌ను వినియోగించారు. సాధారణ నోట్‌బుక్‌ల కంటే తొందరగా అంటే 15 సెకన్లలోనే బూట్ అవడం, బరువు 1.7 కేజీలు, మందం కేవలం 0.78 అంగుళాలు, బ్యాటరీ బ్యాకప్ 8 గంటలు ఉండటం ఈ నోట్‌బుక్స్‌లోని ప్రధాన ఆకర్షణలు.

ఆల్ ఇన్ వన్ కంప్యూటర్ ‘హెచ్‌పీ టీ410’ ఫీచర్లు:

స్ర్కీన్ సైజ్ 18.5 అంగుళాలు (రిసల్యూషన్ 1,366 x 768పిక్సల్స్),

ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

ఇంటర్నల్ మెమెరీ – 1జీబి డీడీఆర్3 400 మెగాహెడ్జ్ ఎస్డీర్యామ్,

ఎక్సటర్నల్ మెమెరీ- 2జీబి ఫ్లాష్,

కార్ట్ స్లాట్ సౌలభ్యత,

వై-ఫై,

యూఎస్బీ కనెక్టువిటీ,

బ్రౌజర్ (హెచ్ టిఎమ్ఎల్),

హై క్వాలిటీ ఆడియో ప్లేయర్,

హై క్వాలిటీ వీడియో ప్లేయర్,

24వాట్ ఏసీ పవర్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot