క్వాలిటీ మినీ ల్యాప్‌టాప్ జస్ట్ పాతికవేలకే!!

Posted By: Prashanth

క్వాలిటీ మినీ ల్యాప్‌టాప్ జస్ట్ పాతికవేలకే!!

 

కంప్యూటింగ్ రంగంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న హెవ్లెట్ ప్యాకర్డ్ (హెచ్‌పీ) ల్యాప్‌టాప్స్ అదేవిధంగా నెట్‌బుక్‌లను రూపొందించటంలో అగ్రగామిగా నిలిచింది. తాజాగా ఈ బ్రాండ్ 10 అంగుళాల డిస్‌ప్లే నమూనాలో ‘మినీ 1104’ నెట్‌బుక్‌ను వ్ళద్థి చేసింది. శక్తివంతమైన డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్ పై డివైజ్ అత్యుత్తమ పనితీరును ప్రదర్శిస్తుంది.

పూర్తి స్థాయి బ్లాక్ షేడ్ కలర్ వేరియంటలో డిజైన్ కాబడి ప్రొఫెషనల్ లుక్‌ను సంతరించుకున్న ఈ డివైజ్ వినియోగదారుడి స్టైల్ ను రెట్టింపు చేస్తుంది. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్ హెచ్చుగా ఉన్న ఈ మినీ కంప్యూటింగ్ డివైజ్ లో విండోస్ 7 ఆపరిటింగ్ సిస్టంను లోడ్ చేశారు. పొందుపరిచిన హై డెఫినిషన్ డిస్‌ప్లే వ్యవస్థ మన్నికైన విజువల్ అనుభూతిని కలిగిస్తుంది. ఏర్పాటు చేసిన డ్యూయర్ కోర్ ప్రాసెసింగ్ వ్యవస్థ 1.6 GHz క్లాక్ స్పీడ్ వేగంతో రెట్టింపైన పనితీరును ప్రదర్శిస్తుంది.

డివైజ్‌లో దోహదం చేసిన 2జీబి ర్యామ్, 320జీబి హార్డ్‌డిస్క్ వ్యవస్థలు మెమరీ సామర్ధ్యాన్ని బలోపేతం చేస్తాయి. లోడ్ చేసిన వై-ఫై అప్లికేషన్ వేగవంతమైన నెట్ బ్రౌజింగ్‌కు తోడ్పడుతుంది. బ్లూటూత్, యూఎస్బీ 3.0 కనెక్టువిటీ వ్యవస్థలు డేటాను శరవేగంగా రవాణా చేస్తాయి. నెట్‌బుక్‌ను హైడెఫినిషన్ టీవీలకు జతచేసుకునే విధంగా హెచ్డీఎమ్ఐ పోర్టు ఏర్పాటు, ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ నిర్వహించుకునేందుకు వెబ్ కెమెరాను డివైజ్ ముందుభాగంలో ఏర్పాటు చేశారు. ఇండియన్ మార్కెట్లో ‘హెచ్ పీ మినీ1104’ ధర రూ.25,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot