చవక మరియు మన్నిక.. త్వరపడండి!!

Posted By: Staff

చవక మరియు మన్నిక.. త్వరపడండి!!

 

ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ హెచ్‌పీ (HP), తాజాగా రూపొందించిన నెట్‌బుక్ హెచ్‌పీ మినీ 100 మన్నికైన ఫీచర్లను ఒదిగి ఉండటంతో పాటు తక్కువ ధరకే లభ్యమవుతోంది. టాబ్లెట్ కంప్యూటర్ల రాకతో నెట్‌బుక్ మార్కెట్ మందగించిన విషయం తెలిసిందే. ప్రయాణ సందర్భాల్లో  కంప్యూటింగ్ అవసరాలను తీర్చేందుకు ఈ డివైజ్ పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది.

హెచ్‌పీ మినీ 110 ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లు:

10.1 అంగుళాల యాంటీ గ్లేర్ ఎల్‌ఈడి డిస్‌ప్లే, (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్ ),

టైపింగ్‌కు పూర్తి స్థాయిలో అనువైన కీబోర్డ్,

320జీబి హార్డ్‌డిస్క్,

2జీబి ర్యామ్,

ఇంటెల్ ఆటమ్ ఎన్2600 ప్రాసెసర్,

ఇంటెల్ గ్రాఫిక్ మీడియా యాక్సిలరేటర్,

ఇంటిగ్రేటెడ్ వెబ్ కెమెరా,

వై-ఫై (802.11 b/g/n),

బ్లూటూత్,

యూఎస్బీ 2.0 పోర్టు,

ఈ డివైజ్ బరువు 1.38కిలో గ్రాములు మాత్రమే. సాకర్యవతంగా డిజైన్ చేశారు. ఏర్పాటు చేసిన టచ్ ప్యాడ్ వ్యవస్థ సౌకర్యవంతంగా స్పందిస్తుంది. మార్కెట్ ధర రూ.20,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting