ఎవరూ హ్యాక్ చేయలేని ఫీచర్‌తో హెచ్‌పీ ల్యాప్‌టాప్

|

పబ్లిక్ ప్రాంతాల్లో ప్రైవసీతో కూడిన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హెచ్‌పీ ప్రైవసీకి పెద్దపీట వేస్తూ సరికొత్త సెక్యూరిటీ లెవల్స్‌తో కూడిన విప్లవాత్మక ల్యాప్‌టాప్‌లను అందుబాటులోకి తీసుకురాబోతోంది.

ఎవరూ హ్యాక్ చేయలేని ఫీచర్‌తో హెచ్‌పీ ల్యాప్‌టాప్

Read More : వాట్సాప్‌లో అలాంటివి పోస్ట్ చేస్తే జైలుకే!

Sure View పేరుతో హెచ్‌పీ అభివృద్థి చేసిన ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ వ్యవస్థ బ్రౌజింగ్ సమయంలో ల్యాప్‌టాప్‌లకు మరింత భద్రతనిస్తుంది. ఈ ఫీచర్ డిస్‌ప్లే వ్యూవింగ్ యాంగిల్స్‌ను మరింత కటాఫ్ చేస్తూ, ఒక్క యూజర్ మాత్రమే డిస్‍ప్లేను చూసేవిధంగా విజన్‌ను సమకూరుస్తుంది. సెప్టంబ‌ర్‌లో విడుదల చేయబోతున్న EliteBook 1040, EliteBook 840 ల్యాప్‌టాప్‌లలో హెచ్‌పీ ఈ ఫీచర్‌ను పొందుపరచనుంది.

 మీ ల్యాప్‌టాప్‌కు 5 వార్నింగ్ బెల్స్

మీ ల్యాప్‌టాప్‌కు 5 వార్నింగ్ బెల్స్

పోర్టబుల్ కంప్యూటింగ్‌ను చేరువచేస్తున్న సౌకర్యవంతమైన గాడ్జెట్‌లలో ల్యాప్‌టాప్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పిండి కొద్ది రొట్టే.. జాతి కొద్ది పాలు అన్నట్లు ల్యాప్‌టాప్‌లు వీటి పనితీరు మనం వినియోగించుకునే తీరును బట్టి ఉంటుంది. మీ డివైస్ నెమ్మదైన పనితీరును కనబరుస్తుందంటే ఖచ్చితంగా ఏవో లోపాలు ఉన్నట్లే. మీ ల్యాప్‌టాప్ ప్రమాదంలో పడతందనటానికి 5 వార్నింగ్ బెల్స్‌....

వార్నింగ్ 1

వార్నింగ్ 1

మీ ల్యాప్‌టాప్ మథర్ బోర్డ్ నుంచి అసాధారణ శబ్ధాలు వెలువడుతున్నాయా..? అయితే ఖచ్చితంగా మీ ల్యాపీ మథర్ బోర్డ్ ప్రమాదంలో ఉన్నట్లే. ఈ సంకేతాన్ని ముందస్తు హెచ్చరికగా భావించి సర్వీసింగ్ సెంటర్‌కు తరలించటం మంచిది.

వార్నింగ్ 2

వార్నింగ్ 2

వాడటం మొదలు పెట్టిన గంటలోపే మీ ల్యాపీ నుంచి అధిక వేడి ఉత్పన్నమవుతోందా..? ఇదే మంచి సంకేతం కాదు.

వార్నింగ్ 3

వార్నింగ్ 3

మీ ల్యాప్‌టాప్ తరచూ రీస్టార్డ్ అవుతోందా..? రీబూట్ చేసే సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయా..? ఈ సంకేతాన్ని ముందస్తు హెచ్చరికగా భావించండి. వెంటనే మీ డివైస్ ను సర్వీసింగ్ సెంటర్‌కు తరలించటం మంచిది.

వార్నింగ్ 4

వార్నింగ్ 4

ఏదైనా ఫైల్ ఓపెనింగ్ లేదా సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను అప్‌డేట్ చేసే సమయంలో మీ ల్యాప్‌టాప్ File Errorsను చూపిస్తోందా..? ఈ సంకేతాన్ని ముందస్తు హెచ్చరికగా భావించండి. వెంటనే మీ డివైస్ ను సర్వీసింగ్ సెంటర్ కు తరలించటం మంచిది.

వార్నింగ్ 5

వార్నింగ్ 5

మీ ల్యాప్‌టాప్ నత్తనడకన స్పందిస్తోందా..? ఏదైనా సమాయాన్ని ప్రాసెస్ చేసేందుకు ఎక్కువ సమయాన్ని తీసుకుంటోందా..? ఈ సంకేతాన్ని ముందస్తు హెచ్చరికగా భావించండి. వెంటనే మీ డివైస్ ను సర్వీసింగ్ సెంటర్‌కు తరలించటం మంచిది.

 

 

Best Mobiles in India

English summary
HP New 'Sure View' Feature to Ensure No-One Can Spy on Your Laptop. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X