HP నుంచి గేమింగ్ ల్యాప్‌టాప్.. AI సామర్థ్యం, FHD కెమెరా సహా ఎన్నో ఫీచర్లు..!
ప్రముఖ ల్యాప్‌టాప్‌ల తయారీ సంస్థ HP తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యంతో HP OMEN 16 గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. మెరుగైన పనితీరు కలిగిన ల్యాప్‌టాప్‌ల కోసం చూస్తున్న యూజర్లకు మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. ఈ ల్యా్ప్‌టాప్ అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్ ను కూడా కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ ఫీచర్లు, ధర, సేల్ వివరాలు.
HP ఓమన్ 16 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ హెచ్‌పీ ల్యాప్‌టాప్ 16 అంగుళాల QHD (2560 x 1600 పిక్సల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ 240Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 3ms రెస్పాన్స్ టైమ్‌ను కలిగి ఉంది. 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మెరుగైన ఐ కేర్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

ఈ హెచ్‌పీ OMEN 16 స్మా్ర్ట్‌ఫోన్ ఇంటెల్ కోర్ అల్ట్రా లేదా AMD Ryzen AI ప్రాసెసర్‌లపైన పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 12GB NVIDIA GeForce RTX 5070 Ti GPU ను కూడా కలిగి ఉంది. ఫలితంగా గేమింగ్ సమయంలో ఆకట్టుకుంటుందని చెబుతోంది.
వేపర్ చాంబర్ కూలింగ్ :
మల్టీ టాస్కింగ్, గేమింగ్ కారణంగా ల్యాప్‌టాప్ వేడెక్కకుండా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లను కలిగి ఉంది. మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం వేపర్ చాంబర్ కూలింగ్‌తో కూడిన సిస్టమ్ ఉంటుంది. HP OMEN 16 ల్యాప్‌టాప్ విండోస్ 11 పైన పనిచేస్తుంది. దీని ద్వారా అనేక ఫీచర్లు, టూల్స్ అందుబాటులోకి వస్తాయి.

గేమింగ్ హబ్ :
పర్సనలైజ్డ్ గేమింగ్ కోసం ఈ ల్యాప్‌టాప్ గేమింగ్ హబ్‌ను కలిగి ఉంది. దీని ద్వారా గేమింగ్ సెట్టింగ్స్, పవర్ మోడ్స్, కూలింగ్ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు OMEN లైట్ స్టూడియోను కూడా కలిగి ఉంటుంది.
50 శాతం ఛార్జింగ్ :
హెచ్‌పీ ఒమన్ 16 ల్యాప్‌టాప్ 6 సెల్ 83Wh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్టు చేస్తుంది. కేవలం 50 శాతం ఛార్జింగ్‌ను 30 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. గేమింగ్ సమయాల్లో ఈ ఫాస్ట్ టెక్నాలజీ అనుకూలంగా ఉంటుంది.
ఈ HP ల్యాప్‌టాప్ FHD వెబ్‌క్యామ్‌ను కలిగి ఉంది. ఫలితంగా వీడియో క్వాలిటీ ఆకట్టుకుంటుంది. తక్కువ లైటింగ్ సమయాల్లోనూ మెరుగైన అనుభూతిని అందిస్తుందని సంస్థ చెబుతోంది. దీంతోపాటు కాలింగ్ సమయాల్లో వాయిస్ పరంగా కాల్ క్వాలిటీ కూడా ఆకట్టుకుంటుంది.
HP ల్యాప్‌టాప్ ధర, సేల్ వివరాలు :
ఈ ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.1,29,999 గా ఉంది. ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. HP వరల్డ్, హెచ్‌పీ ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఇతర ప్రధాన రిటైల్స్ స్టోర్స్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
ఈ ల్యాప్‌టాప్ షాడో బ్లాక్ కలర్ వేరియంట్స్‌లోనే లభిస్తుంది. మెరుగైన పనితీరు, గేమింగ్ కోసం చూసే వారికి అనుకూలంగా ఉంటుందని సంస్థ చెబుతోంది. దీంతోపాటు అనేక కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయని చెబుతోంది.


Click it and Unblock the Notifications








