యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటర్..

Posted By: Staff

యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటర్..

 

పర్సనల్ కంప్యూటర్ల వినియోగం రోజు రోజుకు విస్తరిస్తున్న నేపధ్యంలో అనేక కంపెనీలు వీటిని తయారుచేస్తున్నాయి. పర్సనల్ కంప్యూటర్ల నిర్మాణ రంగంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న హెచ్‌పీ తన ఆల్-ఇన్-వన్ కంప్యూటర్ సిరీస్ నుంచి ఆధునిక ఫీచర్లతో కూడిన పీసీని డిజైన్ చేసింది. Omni 120Zగా రూపుదిద్దుకున్న ఈ కంప్యూటింగ్ డివైజ్ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. తాజా విశిష్టతలతో పాటు సరికొత్త స్టైల్‌ను ఒదిగి ఉన్న ఈ గ్యాడ్జెట్ పర్యావరణానికి మేలు చేసేదిగా ఉంటుంది.

హెచ్‌పీ Omni 120Z ఫీచర్లు:

- 20 అంగుళాల హై‌డెఫినిషన్ వైడ్ స్ర్కీన్,

- విండోస్ 7 హోమ్ ప్రీమియ్ ఆపరేటింగ్ సిస్టం,

- ఏఎమ్‌డి ఈ450 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

- వేగవంతమైన వెబ్‌బ్రౌజింగ్,

- వై-ఫై కనెక్టువిటీ,

- బుల్ట్‌ఇన్ మైక్,

- వెబ్‌క్యామ్,

- 6ఇన్1 డిజిటల్ మీడియా కార్డ్ రీడర్.

అమర్చిన హై డెఫినిషన్ డిస్‌ప్లే తక్కువ పవర్‌ను ఖర్చు చేస్తుంది. అత్యుత్తమ యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్‌ను యూజర్ ఈ డివైజ్ ద్వారా పొందవచ్చు. ఇండియన్ మార్కెట్లో Omni 120Z ఖచ్చితమైన ధర రూ.20,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot