అమ్మకాల రికార్డ్‌ను బ్రేక్ చేస్తుందా..?

Posted By: Prashanth

అమ్మకాల రికార్డ్‌ను బ్రేక్ చేస్తుందా..?

 

టాబ్లెట్ పీసీల అమ్మకాలలో రికార్డుల దిశగా పయనించిన ‘హెచ్‌పీ టచ్‌ప్యాడ్ టాబ్లెట్ పీసీ ’ మార్కెట్‌ను కుదిపేసిన విషయం తెలిసిందే. సక్సెస్ ఊపులో ఉన్న ఈ బ్రాండ్ 7 అంగుళాల డిస్‌ప్లే సైజ్‌తో మరో ఉత్తమ టాబ్లెట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ‘హెచ్‌పీ ఓపల్’ వస్తున్న ఈ స్లిమ్ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ముఖ్య విశేషాలు:

* 7 అంగుళాల స్క్రీన్, * వెబ్ బేసిడ్ ఆపరేటింగ్ సిస్టం, * శక్తివంతమైన డ్యూయల్ కోర్ క్వాల్కమ్ APQ8060 ప్రాసెసర్, * ప్రాసెసర్ క్లాక్ వేగం 1.5 GHz,* 5 మెగా పిక్సల్ కెమెరా, * 3జి ఎఫ్ఎమ్ రేడియో.

టచ్‌ప్యాడ్ ఫీచర్లను పునికిపచ్చుకున్న ఓవల్ డిజైన్ విషయంలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. డివైజ్ బ్యాక్ ప్యానల్ బ్లాక్ కలర్ ఫినిషింగ్‌తో ప్రొఫెషనల్ లుక్‌ను కలిగి ఉంటుంది. టాబ్లెట్ స్ర్కీన్ రేషియో 4:3, రిసల్యూషన్ 1024 x 768 పిక్సల్స్.  డివైజ్ ముందు భాగాన్ని పరిశీలిస్తే ఏర్పాటు చేసిన 7 అంగుళాల స్ర్కీన్ పూర్తిగా డామినేట్ చేస్తుంది.

మల్టీ టాస్కింగ్ యంత్రంలా ఈ డివైజ్ ఉపయోగపడుతుంది. బీట్స్ ఆడియో వ్యవస్థను టాబ్లెట్‌లో నిక్షిప్తం చేశారు. పీసీలో బుల్ట్ చేసిన స్పీకర్లు క్రిస్టల్ క్లియర్ ఆడియో అనుభూతికి లోను చేస్తాయి. అత్యాధునిక ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లతో ఊరిస్తున్న ‘హెచ్‌పీ ఓపల్’ అతి త్వరలో వినియోగదారుల ముందుకు రానుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot