కంఫర్ట్ కోరకునే వారికి ఫర్‌ఫెక్ట్ ల్యాప్‌టాప్!!

Posted By: Prashanth

కంఫర్ట్ కోరకునే వారికి ఫర్‌ఫెక్ట్ ల్యాప్‌టాప్!!

 

సౌకర్యవంతమైన కంప్యూంటిగ్‌ను కోరుకునే ల్యాప్‌టాప్ యూజర్లకు శుభవార్త.. మీ అంచనాలకు తగ్గట్లుగా హెవ్లెట్ ప్యాకర్ట్ (హెచ్‌పీ) ఓ అత్యుత్తమ కంప్యూటింగ్ డివైజ్‌ను ప్రవేశపెట్టబోతోంది. ‘హెచ్‌పీ పెవిలియన్ DM1 4000’గా వచ్చే ఏడాది విడుదల కాబోతున్న స్మార్ట్ ల్యాపీ విశేషాలు క్లుప్తంగా:

డివైజ్ బరువు 1.6 కిలో గ్రాములు ప్రయాణ సందర్భాల్లో ఏ మాత్రం ఇబ్బంది అనిపించదు. నిక్షిప్తం చేసిన ఇంటెల్ కోర్ i3-2367M 1.4 GHz ప్రాసెసర్ వేగవంతమైన కంప్యూటింగ్‌కు దోహదపడుతుంది. ల్యాపీ ర్యామ్ సామర్ధ్యం 4జీబి, సాటా హార్డ్ డిస్క్ పరిమాణం 500జీబి, స్ర్కీన్ సైజ్ 11.6 అంగుళాలు, ఇంటెల్ హై డెఫినిషన్ గ్రాఫిక్ వ్యవస్థ, వీజీఏ పోర్ట్, హెచ్డీఎమ్ఐ కనెక్టువిటీ, ఆడియో ఇన్‌పుట్/ అవుట్‌పుట్ పోర్ట్, అత్యుత్తమ ఆడియో ప్లే‌బ్యాక్, మల్టీ ఫార్మాట్ మెమరీ కార్డ్ రీడర్, హెచ్‌పీ ట్రూ విజన్ వెబ్‌క్యామ్, బుల్ట్ ఇన్ మైక్రో‌ఫోన్, ఇంటర్నల్ స్సీకర్స్, వై-ఫై, జిగాబిట్ ఇతర్‌నెట్ ల్యాన్, కెన్సింగ్‌టన్ మైక్రో సేవర్ లాక్ స్లాట్, పవర్ ఆన్ ప్రుటక్షన్ పాస్‌వర్డ్

నెట్‌బుక్‌తో పోల్చితే తక్కువ పరిమాణంలో కనిపించే ఈ డివైజ్ డార్క్ గ్రే రంగులో డిజైన్ కాబడింది. ఇండియన్ మార్కెట్లో హెచ్‌పీ పెవిలియన్ DM1 4000 విడుదల అదేవిధంగా ఖరీదుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ స్లిమ్ ల్యాప్‌టాప్ వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల కావచ్చన్న వార్తలు జోరందుకున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot