హెచ్‌పీ పెవిలియన్ ఇప్పుడు కొత్త తరహాలో...!!

Posted By: Super

హెచ్‌పీ పెవిలియన్ ఇప్పుడు కొత్త తరహాలో...!!

ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీదారు ‘హెవ్లెట్ ప్యాకర్డ్ ’ (హెచ్‌పీ) మరో సారి విజృభించింది. అత్యాధునిక AMD LIano టెక్నాలజితో కూడిన ‘హెచ్‌పీ పెవిలియన్ dv6z’ ల్యాపీ పరికరాన్ని మార్కెట్లో విడుదల చేసింది.


క్లుప్తంగా ల్యాపీ ఫీచర్లు:

- 15.5 అంగుళాల హై -డెఫినిషన్ స్క్రీన్ LED డిస్‌ప్లే సామర్ధ్య కలిగి ఉంటుంది.

- AMD Quad Core A6-3400 to 3530 M ప్రాసెసర్ వ్యవస్థ వేగవంతమైన పనితీరు కలిగి ఉంటుంది.

- ఏఎమ్‌డీ రేడియన్ డిస్క్రీట్ క్లాస్ గ్రాఫిక్ అప్లికేషన్ గ్యాడ్జెట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

- Blu-ray ROM drive నాణ్యమైన డీవీడీ బర్న్‌కు దోహదపడుతుంది.

- 6 GB DDR3 పటిష్ట ర్యామ్ వ్యవస్థ మెమరీ సామర్ధ్యాన్ని బలోపేతం చేస్తుంది.

- విండోస్ ఆపరేటింగ్ వ్యవస్థను పరికరంలో లోడ్ చేశారు.

- ప్రుటెక్ట్ స్మార్ట్ టెక్నాలజి వ్యవస్థ ప్రమాదాల బారీ నుంచి ల్యాపీని సంరక్షిస్తుంది.

- మరో వ్యవస్థ ‘కూల్ నెస్ టెక్నాలజీ’ ల్యాపీలోని వేడిని ఎప్పటికప్పుడు నియంత్రిస్తుంది.

- లైవ్ వీడియో ఛాటింగ్ నిర్వహించుకునేందుకు వెబ్ కెమెరాను ల్యాపీలో అమర్చారు.

- ఏర్పాటు చేసిన ఫింగర్ ప్రింట్ వ్యవస్థ ల్యాపీకి రక్షణ కవచంలా నిలుస్తుంది.

- కనెక్టువిటీ అంశాలైన బ్లూటూత్, వై-ఫైలు సమాచార వ్యవస్థను మరింత పటిష్టపరుస్తాయి.

- ల్యాపీ కోనుగోలుతో 5 గ్యేమ్‌లతో పాటు 60 రోజు యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ ఉచితంగా పొందవచ్చు.

- అత్యాధునిక ఫీచర్లతో డిజైన్ కాబడ్డ ‘హెచ్‌పీ పెవిలియన్ dv6z’ను రూ.40,000లకు సొంతం చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot