‘హెచ్ పీ’ ఇప్పుడు కొత్త ఒరవడితో..!!

Posted By: Staff

‘హెచ్ పీ’ ఇప్పుడు కొత్త ఒరవడితో..!!


‘హెవ్లెట్ ప్యాకర్డ్’ఓ దిగ్గజ మల్టీ నేషనల్ సంస్థ.., సాంకేతిక పరికరాల తయారీ వ్యవస్థలో దూసుకుపోతున్న హాట్ బ్రాండ్.., మరికాస్త లోతుకు వెళితే...?

ప్రముఖ కంప్యూటర్ పరికరాల తయారీదారు Hewlett Packard (HP) సరికొత్త ల్యాపీ పరికరాన్ని అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేయునుంది. ‘హెచ్ పీ పెవిలియన్ DV7-6101sa’ వర్షన్లో విడుదల కాబోతున్న ఈ గ్యాడ్జెట్ ఫీచర్లను క్లుప్తంగా తెలుసుకుందాం.

విండోస్ హోమ్ ప్రీమియమ్ 64 బిట్ ఆపరేటింగ్ వ్యవస్థను ల్యాపీలో లోడ్ చేశారు. AMD A4 ప్రాసెసర్ వ్యవస్థ 2.1 GHz ప్రాసెసింగ్ వేగాన్ని కలిగి ఉంటుంది. 17.3 అంగుళాల స్క్రీన్ 1600*900 పికల్స్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది. AMD Radeon HD 6515G2 గ్రాఫిక్ వ్యవస్థ నాణ్యమైన గ్రాఫిక్ విజువల్స్ ను విడుదల చేస్తుంది.

అత్యాధునిక బ్లూటూత్, 802.11n వై-ఫై కనెక్టువిటీ వ్యవస్థలు సమచార రవాణాను మరింత వేగవంతం చేస్తుంది. 6జీబీ ఇంటర్నెల్ మెమరీ, 2 మెమరీ స్లాట్స్, 512 ఎంబీ గ్రాఫిక్ వ్యవస్థ, 3.5mm ఆడియో జాక్, మల్లీ ఫార్మాట్ మెమరీ కార్డ్ రీడర్, ఇంటర్నెల్ డివీడీ రైటర్, మినీ జాక్ ఆడియో అవుట్ పుట్, మినీ జాక్ మైక్రో ఫోన్ ఇన్ పుట్ అంశాలు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి. సంవత్సరం వారంటీతో లభ్యంకానున్న ‘HP Pavilion DV7-6101sa’ ల్యాపీ ధర రూ.43,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot