HP Pavilion Power ల్యాపీ, ధర కాస్త ఎక్కువే !
క్రియేటివ్ ప్రొఫెషనల్స్ కోసం హెచ్‌పీ సరికొత్త ల్యాపీని విడుదల చేసింది.
క్రియేటివ్ ప్రొఫెషనల్స్ కోసం హెచ్‌పీ సరికొత్త ల్యాపీని విడుదల చేసింది. దీని ధరను కంపెనీ రూ.79,990 గా నిర్ణయించింది. పెవిలియన్ పవర్' పేరిట విడుదలైన ఈ ల్యాపీ అన్ని హెచ్‌పీ రీటెయిల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. షాడో బ్లాక్ కలర్, గ్రీన్ వేరియంట్ కలర్స్ లో ఈ ల్యాపీ లభ్యం కానుంది.

ఇందులో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, 4జీబీ గ్రాఫిక్స్ మెమొరీ, ఇంటెల్ 7వ జనరేషన్ కోర్ ఐ5/ఐ7 ప్రాసెసర్, 15.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 128 జీబీ ఎస్‌ఎస్‌డీ, 1 టీబీ హార్డ్ డిస్క్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 90 నిమిషాల్లో 90 శాతం ఛార్జ్ అయ్యే కెపాసిటీ దీనికి ఉందని కంపెనీ చెబుతోంది.


Click it and Unblock the Notifications








