ఊరిస్తున్న కత్తిలాంటి ల్యాప్ టాప్..?

Posted By: Prashanth

ఊరిస్తున్న కత్తిలాంటి ల్యాప్ టాప్..?

 

హెచ్‌పీ రూపొందించిన 11 అంగుళాల సొగసరి ల్యాప్‌టాప్ ఉన్నతమైన ఫీచర్లతో టెక్ ప్రేమికులను ఊరిస్తుంది. ‘పెవిలియన్ డీఎమ్1-4003ఏయూ’ నమూనాలో డిజైన్ కాబడిన ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ఉత్తమ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లను ఒదిగి ఉంది.

ల్యాపీ ముఖ్య ఫీచర్లు, అదే విధంగా పనితీరు:

11.6 అంగుళాల హై డెఫినిషన్ బ్రైట్ వ్యూ స్ర్కీన్ డిస్‌ప్లే క్లారిటీతో కూడిన విజువల్స్‌ను అందిస్తుంది. విండోస్ 7 హోమ్ బేసిక్ 64 బిట్ ఆపరేటింగ్ వ్యవస్థపై డివైజ్ రన్ అవుతుంది. 1.65GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ల్యాపీ పని వ్యవస్థను బలోపేతం చేస్తుంది. గ్రాఫిక్ వ్యవస్థను పటిష్టపరుస్తూ ఏఎమ్‌డి రాడియోన్ హై డెఫినిషన్ 6320 గ్రాఫిక్ కార్డ్‌ను ల్యాపీలో బుల్ట్ చేశారు. ర్యామ్ సామర్ద్యం 2జీబి, హార్డ్ డిస్క్ పరిమాణం 320జీబి, ఏర్పాటు చేసిన హైడెఫినిషన్ వెబ్ క్యామ్ క్వాలిటీతో కూడిన ప్రత్యక్ష వీడియో ఛాటింగ్‌కు తోడ్పడుతుంది. 802.11 a/b/g/n వై-ఫై వ్యవస్థ హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది.

బ్లూటూత్, యూఎస్టీ కెనెక్టువిటీ వ్యవస్థలు ల్యాపీ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని మరింత బలపేతం చేస్తాయి. ఏర్పాటు చేసిన హెచ్డీఎమ్ఐ పోర్టు సౌలభ్యతతో హైడెఫినిషన్ టీవీ, హైడెఫినిషన్ ప్రొజెక్టర్‌లకు ల్యాపీని కనెక్ట్ చేసుకోవచ్చు. 6సెల్ లి-యోన్ బ్యాటరీ వ్యవస్థ మన్నికైన బ్యాకప్ నిస్తుంది. ఇండియన్ మార్కెట్లో ల్యాపీ విలువ రూ. 25,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot