పక్కా.. బిజినెస్ కోసమే!!

Posted By: Prashanth

పక్కా.. బిజినెస్ కోసమే!!

 

అన్ని వర్గాల వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో హెచ్‌పీ, నూతన ప్రయత్నంగా 10 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో విండోస్ ఆధారిత టాబ్లెట్ కంప్యూటర్‌ను డిజైన్ చేస్తుంది. ప్రత్యేకించి బిజినెస్ వర్గాల కోసం ఈ గ్యాడ్జెట్‌ను వృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. పల్చటి శరీరాకృతితో నాజూకైన కోణంలో రూపుదిద్దుకుంటున్న ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ పేరు హెచ్‌పీ స్లేట్ 8. ఈ సరికొత్త ప్రయోగంతో మార్కెట్ డిమాండ్‌ను పెంచుకోవాలని హెచ్‌పీ వర్గాలు భావిస్తున్నాయి.

హెచ్‌పీ స్లేట్ 8 కీలక ఫీచర్లు:

10.1 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,

విండోస్ 8 ప్రొఫెషనల్ ఆఫరేటింగ్ సిస్టం,

డిజిటల్ పిన్ అవుట్ పుట్,

9.2ఎమ్ఎమ్ పల్చటి శరీరాకృతి,

బ్యాటరీ బ్యాకప్ 8 నుంచి 10 గంటలు,

ఎంటర్‌ప్రైజ్ లెవల్ డాకింగ్,

ప్రొటెక్ట్ టూల్స్ సాఫ్ట్‌వేర్.

ఈ టాబ్లెట్‌లో ఒదిగి ఉన్న స్లిమ్‌ తత్వం అదేవిధంగా యూజర్ ఫ్రెండ్లీ స్వభావం యూజర్‌కు మరింత సంతృప్తినిస్తాయి. మన్నికైన సెక్యూరిటీ వ్యవస్థను ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. వెడల్పాటి స్ర్కీన్, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్, విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టంలు అంతిమంగా క్వాలిటీ కంప్యూటింగ్ అనుభూతులను వినియోగదారుకు చేరువచేస్తాయి. హెచ్‌పీ స్లేట్ 8 విడుదలకు సంబంధించి ఖచ్చితమైన తేదీ ఖరారుకాలేదు. అయితే, ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయిని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మన్నిక అదేవిధంగా ఆధునీకతకు పెద్దపీట వేసే హెచ్‌పీ ఈ సరికొత్త ఆవిష్కరణతో గ్యాడ్జెట్ ప్రేమికులకు మరింత చేరువయ్యే అవకశాలు కనిపిస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot