‘హెచ్‌పీ’ తాజా పరిస్థితి ఏంటి..?

Posted By: Super

‘హెచ్‌పీ’ తాజా పరిస్థితి ఏంటి..?

కంప్యూటర్ రంగంలో 20 సంవత్సరాల అనుభవం.., వినియోగదారుల్లో ఆపార విశ్వాసం.., మన్నికే ప్రధాన లక్ష్యం.., ఇది హెవ్లిట్‌ ప్యాకర్డ్ (హెచ్‌పీ) సూత్రం. మారుతున్న సాంకేతికతను అనసరిస్తూ ఆధునిక వర్షన్‌లలో పలు కంప్యూటర్ పీసీలతో పాటు ల్యాపీలను ఈ సాంకేతిక దిగ్గజం విడుదల చేసింది. కమర్షియల్ వినియోగానికే కాకుండా బిజినెస్ పరంగా ఉపయోగపడేందుకు హెచ్‌పీ తాజాగా ప్రోబుక్ 4530 పేరుతో అత్యాధునిక ల్యాపీ పరికరాన్ని మార్కెట్లో విడుదల చేసింది.

- ఆల్యూమినియమ్ ఫినిష్‌తో డిజైన్ చేయబడిన ‘ప్రోబుక్’, ప్రయాణంలో సైతం సలువుగా మోసుకెళ్లే విధంగా 2.36కిలో గ్రాముల బరువు మాత్రమే కలిగి ఉంటుంది.

- స్పిల్ రెసిస్టెంట్ కీప్యాడ్ సులవైన టైపింగ్‌కు సహకరిస్తుంది.

- 3.6 అంగుళాల టచ్‌ప్యాడ్ వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తుంది.

- యూఎస్బీ 3.0, 2.0 పోర్ట్స్, ఇతర్‌నెట్ పోర్టు వంటి అంశాలు డేటా షేరింగ్ అంశాలను వేగవంతంగా నడిపిస్తాయి.

- ఇయర్‌ఫోన్, మైక్రో‌ఫోన్ వంటి ఎక్సటర్నల్ ఫీచర్లు ల్యాపీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

- 15.6 అంగుళాల స్క్రీన్ డిస్ ప్లే, 1366*768 రిసల్యూషన్ కలిగి ఉంటుంది.

- పొందుపరిచిన హై డెఫినిషన్ కెమెరా వ్యవస్థ 720 పిక్సల్ వీడియో సామర్ధ్యం కలిగి ఉంటుంది.

- ఇంటెల్ కోర్ i5-2410m ప్రొసెసింగ్ వ్యవస్థ వేగవంతమైన పనితీరును వినియోగదారుడికి అందిస్తుంది.

- 4జీబీ ర్యామ్, 500జీబీ హార్డ్ డ్రైవ్ వ్యవస్థను స్టోరేజి సామర్ధ్యాన్ని మరింత పటిష్టపరుస్తాయి.

- విండోస్ 7 ప్రొఫెషనల్ ఆపరేటింగ్ వ్యవస్థను ల్యాపీలో లోడ్ చేశారు.

- పటిష్ట బ్యాటరీ వ్యవస్థ 5 గంటల బ్యాకప్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

- ‘డేటా’ భద్రతకు సంబంధించి ఫింగర్ ఫ్రింట్ ఐడీ వ్యవస్థను ల్యాపీలో ఏర్పాటు చేశారు.

- భద్రతకు సంబంధించి ‘డ్రైవ్ ఇన్ స్ర్కిప్టాన్ టూల్’ను ప్రత్యేకంగా గ్యాడ్జెట్లో పొందుపరిచారు.

- హెచ్‌పీ క్విక్ వెబ్ 3.0 వ్యవస్థ వేగవంతమైన బూటింగ్‌కు సహకరిస్తుంది.

- ఆధునిక ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న ‘హెచ్‌పీ ప్రో బుక్’ ధర రూ.26,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot