‘హెచ్‌పీ స్లేట్ -2’ ఇప్పుడు పూర్తి భద్రతతో..!!

Posted By: Super

‘హెచ్‌పీ స్లేట్ -2’ ఇప్పుడు పూర్తి భద్రతతో..!!


‘‘భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ సారధి రచించిన వ్యూహం ఫలించిందా..?’’

అమెరికా పారిశ్రామిక దిగ్గజం హెవ్లెట్ ప్యాకర్డ్ (హెచ్‌పీ) సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాల్లో పంజా విసిరేందుకు తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తుంది. కంప్యూటింగ్ హార్డ్‌వేర్ మరియు స్టోరేజి డివైజులను డిజైన్ చేయ్యటంలో ఈ సంస్థది అందవేసిన చేయి.

కంప్యూటింగ్ పరిశ్రమలో కొత్త శకానికి నాంది పలుకుతూ 2010లో హెచ్‌పీ రూపొందించిన ‘స్లేట్ 500’ (Slate500)కు సీక్వెల్‌గా అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో ‘స్లేట్-2’ (Slate-2) రూపుదిద్దుకుంది. అత్యాధునిక హంగులతో విడుదల కాబోతున్న ‘స్లేట్ -2’ టాబ్లెట్ పీసీలో, నెట్‌బుక్‌లో లభ్యమయ్యే ఆధునిక ఫీచర్లు నిక్షిప్తం కాబడ్డాయి.

కేవలం 690 గ్రాములు బరువుతో డిజైన్ కాబడ్డ ‘స్లేట్ -2’ బిజినెస్ వర్గాలను విశేషంగా ఆకట్టుకుంటుంది. క్లుప్తంగా ఫీచర్లను పరిశీలిస్తే 8.9 అంగుళాల LCD డిస్‌ప్లే, మల్టీ టచ్‌స్క్ర్రీన్, విండోస్ 7 ప్రొఫెషనల్ 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇంటెల్ ఆటమ్ Z670 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, ఇంటర్నెల్ మెమరీ 64జీబీ, mSATA హార్డ్ డ్రైవ్, మైక్రో ఎస్డీ స్లాట్, 3 మెగా పిక్సల్ ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు, కనెక్టువిటీ అంశాలను మరింత పటిష్టితం చేస్తూ పొందుపరిచిన వై-ఫై, బ్లూటూత్ వర్షన్ 4.0 యూఎస్బీ 2.0 పోర్ట్సు, హెచ్డీఎమ్ఐ కనెక్షన్ పోర్టు, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, యాక్సిలరోమీటర్ సెన్సార్ వంటి అంశాలు మరింత లబ్ధి చేకూర్చే విధంగా ఉంటాయి.

ప్రధానంగా ట్రస్టడ్ ప్లాట్‌ఫామ్ మాడ్యుల్ (టీపీఎమ్) సెక్యూరిటీ చిప్‌ను టాబ్లెట్లో అనుసంధానం చేశారు. ఈ సౌలభ్యతతో మీ డేటాకు పూర్తి స్థాయి భద్రత లభిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot