హెచ్‌పి స్లేట్ 7 వాయిస్ ట్యాబ్ @రూ.16,990
కంప్యూటర్ పరికరాల తయారీ విభాగంలో అంతర్జాతీయంగా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసకున్న హ్యులెట్ ప్యాకార్డ్ (హెచ్‌పీ) ఎట్టకేలకు తన స్లేట్6 వాయిస్ ట్యాబ్, స్లేట్ 7 వాయిస్ ట్యాబ్‌లను ఇండియన్ మార్కెట్లో ఇటీవల ఆవిష్కరించింది. స్లేట్6 వాయిస్ ట్యాబ్ ఫాబ్లెట్ అమ్మకాలు ఇప్పటేకే ప్రారంభమయ్యాయి. తాజాగా ‘హెచ్‌పీ స్లేట్ 7 వాయిస్ ట్యాబ్' అమ్మకాలను హెచ్‌పీ ఇండియా తన ఆన్ లైన్ స్టోర్ ద్వారా ప్రారంభించింది. హెచ్‌పీ స్లేట్ 7 వాయిస్ ట్యాబ్ ను hponlinestore రూ.16,990కి విక్రయిస్తోంది. కొనుగోలు చేసేందుకుక్లిక్ చేయండి.

స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
7 అంగుళాల ఐపీఎస్ హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ మార్వెల్ పీఎక్స్ఏ1088 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం.
డ్యుయల్ సిమ్ సామర్థ్యం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, వై-ఫై, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, మైక్రో యూఎస్బీ, ఎడ్జ్ సపోర్ట్,
ప్రత్యేకమైన ఫీచర్లు: 25జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్,
ప్రీలోడెడ్ అప్లికేషన్లు: హెచ్‌పీ కనెక్టడ్ ఫోటో, హెచ్‌పీ ఫైల్ మేనేజర్, హెచ్‌పీ ఇ-ప్రింట్, హెచ్‌పీ కనెక్టడ్ మ్యూజిక్.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








