హెచ్‌పి స్లేట్6@రూ.22,990

Posted By:

కంప్యూటర్ పరికరాల తయారీ విభాగంలో అంతర్జాతీయంగా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసకున్న హ్యులెట్ ప్యాకార్డ్ (హెచ్‌పి) ఎట్టకేలకు తన స్లేట్6 వాయిస్ ట్యాబ్, స్లేట్ 7 వాయిస్ ట్యాబ్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. వీటీలో స్లేట్6 వాయిస్ ట్యాబ్ ఫాబ్లెట్ శుక్రవారం నుంచి ఆన్‌లైన్ స్టోర్‌లలో లభ్యంకానుంది. ఈ రెండు వాయిస్ కాలింగ్ డివైస్‌లను హెచ్‌పి జనవరిలో ఆవిష్కరించటం జరిగింది. హెచ్‌పి స్లేట్6 వాయిస్ కాలింగ్ ఫాబ్లెట్‌కు సంబంధించి స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

హెచ్‌పి స్లేట్6@రూ.22,990

ఫాబ్లెట్  పరిమాణం 165x82.6x8.98మిల్లీ మీటర్లు,
6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
మార్వెల్ పీఎక్స్ఏ1088 సాక్,
1.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
డ్యుయల్ సిమ్ (రెగ్యులర్ సిమ్ + మైక్రో సిమ్),
16జీబి ఇంటర్నల్ మెమరీ,
3జీ కనెక్టువిటీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (హైడెఫినిషన్ రికార్డింగ్ సపోర్ట్ తో),
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
మైక్రోయూఎస్బీ పోర్ట్,
స్టీరియో ఎఫ్ఎమ్ రేడియో,
బ్లూటూత్3.0, వై-ఫై, జీపీఎస్,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
జీ-సెన్సార్, గైరో సెన్సార్, ఇ-కంపాస్ సెన్సార, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్,

స్లేట్6 వాయిస్ ట్యాబ్ కొనుగోలుదారులకు హెచ్‌పి 3 నెలల పాలు తమ కనెక్టట్ మ్యూజిక్ సర్వీసు నుంచి డేటాను ఉచితగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot