హెచ్‌పి 14 అంగుళాల ఆండ్రాయిడ్ నోట్‌బుక్

Posted By:

2013లో లెనోవో ‘ఏ10' పేరుతో ప్రపంచపు మొట్టమొదటి ఆండ్రాయిడ్ ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. గూగుల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే మొట్టమొదటి నోట్‌బుక్‌గా ఆ డివైస్ చరిత్రపుటల్లో నిలిచింది. తాజాగా, లెనోవో మార్గాన్నే ఎంచుకున్న హెచ్‌పి స్లేట్‌బుక్ 14 (SlateBook 14) పేరుతో ఆండ్రాయిడ్ ఆధారితంగా స్పందించే కంప్యూటింగ్ నోట్‌బుక్‌ను ఆవిష్కరించింది. ఆగష్ట్ 6 నుంచి ఈ డివైస్ అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో హెచ్‌పి స్లేట్‌బుక్ 14 ధర 399 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.23,940). ఆండ్రాయిడ్ ఆధారితంగా స్పందించే హెచ్‌పి స్లేట్‌బుక్ 14 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

హెచ్‌పి 14 అంగుళాల ఆండ్రాయిడ్ నోట్‌బుక్

14 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం,
ఎన్-విడియా టెగ్రా 4 ప్రాసెసర్,
64జీబి స్టోరేజ్,
2జీబి ర్యామ్,
9 గంటల బ్యాటరీ బ్యాకప్,
రెండు యూఎస్బీ పోర్టులు, సింగిల్ హెచ్‌డిఎమ్ఐ పోర్ట్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot