Home
Computer

టాక్ బాగుందని మరోసారి!

By Super
HP T410 all in One desktop

గ్యాడ్జెట్ ప్రియుల సుపరిచిత బ్రాండ్ ‘హెచ్‌పీ’ ఇటీవల కాలంలో రూపొందించిన ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్ కంప్యూటర్లకు ఆశాజనకమైన స్పందన లభిస్తుండటంతో మరో డెస్క్‌టాప్ పీసీని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొత్త వేరియంట్‌లో రాబోతున్న ఈ డెస్క్‌టాప్ పీసీ పేరు ‘హెచ్‌పీ టీ410’. ఈ డివైజ్‌కు సంబంధించి వివరమైన సమాచారం అందుబాటులో లేనప్పటికి, పలు రిపోర్టులు ఆధారంగా కీలక ఫీచర్లను సేకరించటం జరిగింది. వాటి వివరాలు.......

స్ర్కీన్ సైజ్ 18.5 అంగుళాలు (రిసల్యూషన్ 1,366 x 768పిక్సల్స్),


ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,


ఇంటర్నల్ మెమెరీ - 1జీబి డీడీఆర్3 400 మెగాహెడ్జ్ ఎస్డీర్యామ్,


ఎక్సటర్నల్ మెమెరీ- 2జీబి ఫ్లాష్,


కార్ట్ స్లాట్ సౌలభ్యత,


వై-ఫై,


యూఎస్బీ కనెక్టువిటీ,


బ్రౌజర్ (హెచ్ టిఎమ్ఎల్),


హై క్వాలిటీ ఆడియో ప్లేయర్,


హై క్వాలిటీ వీడియో ప్లేయర్,


24వాట్ ఏసీ పవర్ బ్యాటరీ.

పీసీలో ఏర్పాటు చేసిన డిస్‌ప్లే 3ఎమ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. మరో ఫీచర్ పవర్ ఓవర్ ఇతర్‌నెట్ కేబుల్ ఆధారితంగా 13వాట్ పవర్‌ను గ్యాడ్జెట్‌కు అందిస్తుంది. నిక్షిప్తం చేసిన హై క్వాలిటీ ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్ అప్లికేషన్‌లు ఉత్తమ క్వాలిటీ వినోదాన్ని చేరువ చేస్తాయి. ఈ పీసీ విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం లేదు. ధర అంచనా రూ. 25,000. అంతిమంగా మన్నికైన కంప్యూటింగ్‌ను యూజర్ ఈ పీసీ ద్వారా ఆశించవచ్చు.

యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటర్.. హెచ్‌పీ Omni 120Z:

పర్సనల్ కంప్యూటర్ల వినియోగం రోజు రోజుకు విస్తరిస్తున్న నేపధ్యంలో అనేక కంపెనీలు వీటిని తయారుచేస్తున్నాయి. పర్సనల్ కంప్యూటర్ల నిర్మాణ రంగంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న హెచ్‌పీ తన ఆల్-ఇన్-వన్ కంప్యూటర్ సిరీస్ నుంచి ఆధునిక ఫీచర్లతో కూడిన పీసీని డిజైన్ చేసింది. Omni 120Zగా రూపుదిద్దుకున్న ఈ కంప్యూటింగ్ డివైజ్ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. తాజా విశిష్టతలతో పాటు సరికొత్త స్టైల్‌ను ఒదిగి ఉన్న ఈ గ్యాడ్జెట్ పర్యావరణానికి మేలు చేసేదిగా ఉంటుంది.

ప్రధాన ఫీచర్లు:

- 20 అంగుళాల హై‌డెఫినిషన్ వైడ్ స్ర్కీన్, విండోస్ 7 హోమ్ ప్రీమియ్ ఆపరేటింగ్ సిస్టం, ఏఎమ్‌డి ఈ450 డ్యూయల్ కోర్ ప్రాసెసర్, వేగవంతమైన వెబ్‌బ్రౌజింగ్, వై-ఫై కనెక్టువిటీ, బుల్ట్‌ఇన్ మైక్, వెబ్‌క్యామ్, 6ఇన్1 డిజిటల్ మీడియా కార్డ్ రీడర్.

అమర్చిన హై డెఫినిషన్ డిస్‌ప్లే తక్కువ పవర్‌ను ఖర్చు చేస్తుంది. అత్యుత్తమ యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్‌ను యూజర్ ఈ డివైజ్ ద్వారా పొందవచ్చు. ఇండియన్ మార్కెట్లో Omni 120Z ఖచ్చితమైన ధర రూ.20,000.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X