ఒకరు ‘సింహా’.. మరొకరు ‘నరసింహా’...!!

Posted By: Super

ఒకరు ‘సింహా’.. మరొకరు ‘నరసింహా’...!!

ఒక బ్రాండ్ ‘బాలయ్య’ రేంజ్‌లో పవుర్ ఫుల్‌గా దూసుకుపోతుంటే... మరో బ్రాండ్ ‘రజనీకాంత్’ రేంజ్‌లో ప్రపంచ వ్యాప్త అభిమానాన్ని సొంత చేసుకుంది. నూతనంగా టాబ్లెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ‘మోటరోలా’, ‘హెచ్‌పీ’ బ్రాండ్లు ఎదురెదురుగా పోటీ పడనున్నాయి.

‘మోటరోలా జూమ్’ పేరుతో మోటరోలా టాబ్లెట్ పరికరాన్ని విడుదల చేస్తే, ‘టచ్ ప్యాడ్’ పేరుతో హెచ్‌పీ టాబ్లెట్ పరికరాన్ని విడుదల చేసింది. తొలత వీటి ఆపరేటింగ్ అంశాలను పరిశీలిస్తే, ‘టచ్ ప్యాడ్’ వెబ్ 3.0 ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా పనిచేస్తుంది. ‘జూమ్’ ఆండ్రాయిడ్ 3.0 ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా పనిచేస్తుంది. మల్టీ‌టచ్ వ్యవస్థలను ఈ రెండు పరికరాల్లో పొందుపరిచారు. స్ర్కీన్ అంశాలను పరిశీలిస్తే మెటరోటా 10 అంగుళాల స్క్రీన్ సామర్ధ్యం కలిగి ఉండగా, హెచ్‌పీ 9.7 అంగుళాల స్క్రీన్ కలిగి ఉంది.

కెమెరా అంశాలను పరిశీలిస్తే మోటరోటా జూమ్ 5 మెగా పిక్సల్ సామర్ధ్యంతో ముందంజలో ఉంది. హెచ్‌పీ ‘టచ్‌ప్యాడ్’ కేవలం 1.3 మెగా పిక్సల్ సామర్ధ్యంతో వెనుకంజలో ఉంది. బ్యటరీ విషయంలోనూ తేడాలను మనం గమినించవచ్చు. ‘హచ్‌పీ టచ్ ప్యాడ్’ 6300 mAh సామర్ధ్యం కలిగి ఉండగా, ‘మోటరోలా జూమ్’ 3600 mAh సామర్ధ్యం కలిగి ఉంది. బ్యాటరీ విషయంలో ఈ రెండింటి మధ్య భారీ వృత్యాసాన్ని గమనించవచ్చు.

డేటా మేనేజిమెంట్ అంశాలను పరిశీలిస్తే, ఈ రెండు టాబ్లెట్ పీసీలలో బ్లూటూత్, వై - ఫై, జీపీఎస్ వంటి కనెక్టువిటీ అంశాలు దగ్గరగా ఉంటాయి. బరువు అంశాలను పరిశీలిస్తే ‘టచ్ ప్యాడ్’ 740 గ్రాముల బరువు కలిగి ఉండగా, మోటరోలా జూమ్ 730 గ్రాములు ఉంటుంది. జీబీని ఈ రెండు గ్యాడ్జట్లలో 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. ధర విషయానికొస్తే ‘మోటరోలా జూమ్’ రూ.35000 ఉండగా ‘హెచ్ పీ టచ్ ప్యాడ్’ ధర రూ.30000 పలుకుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot