ఈ డెస్క్‌టాప్‌ను చేతితో ఆపరేట్ చేయండి!!!

Posted By: Prashanth

ఈ డెస్క్‌టాప్‌ను చేతితో ఆపరేట్ చేయండి!!!

 

హెచ్‌పీ టచ్‌స్మార్ట్ 9300 ఇలైట్ (HP TouchSmart 9300 Elite) పేరుతో ఇటీవల విడదులైన టచ్ ఆధారిత డెస్క్‌టాప్ కంప్యూటర్ అన్ని వర్గాల కంప్యూంటింగ్ యూజర్లుకు ఉపయుక్తమైన సేవలనందిస్తుంది. ఈ డెస్క్‌టాప్ స్ర్కీన్ 23 అంగుళాల మల్టీ టచ్ స్వభావం కలిగి ఉంటుంది. చేతి వేళ్లతో డెస్క్‌టాప్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. వైర్‌లెస్ కీబోర్డ్ అదే విధంగా వైర్‌లెస్ మౌస్, విండోస్ 7 ప్రొఫెషనల్ ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ కోర్ సెకండ్ జనరేషన్ ప్రాసెసర్, న్విడియా జీ‌ఫోర్స్ జీటీ 425 గ్రాఫిక్ వ్యవస్థలు పటిష్టమైన పనితీరు కలిగి ఉంటాయి.

హెచ్‌పీ వెనుకటి టచ్ స్మార్ట్ మోడల్స్‌తో పోలిస్తే తాజాగా విడుదలైన ఎలైట్‌కు దగ్గర పోలికలు ఉంటాయి. డివైజులో మొత్తం 7 యూఎస్బీ పోర్టులను ఏర్పాటు చేశారు. పోర్టులన్ని 2.0 వర్షన్ సామర్ధ్యం కలిగి ఉంటాయి. పీసీలో యూఎస్బీ 3.0 వర్షన్ పోర్ట్లులు లోపించాయి. వినియోగదారుడు అవసరాన్ని బట్లి డీవీడీ డ్రైవ్ లేదా బ్లూరే డ్రైవ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. 1 ట్యాబ్ సామర్ధ్యం గల హార్డ్‌డిస్క్ స్టోరేజ్ వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తుంది. ఇతర్‌నెట్, వై-ఫై, మెమరీ కార్డ్ రీడర్ తదితర కనెక్టువిటీ అంశాలు వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫరింగ్‌కు దోహదపడతాయి.

పని సామర్ధ్యాన్ని బట్లి ప్రాసెసర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో హెచ్‌పీ టచ్‌స్మార్ట్ 9300 ఇలైట్ నిర్ధేశిత ధర రూ.40,000. మీరు ఎంపిక చేసుకునే స్పెసిఫికేషన్లను బట్టి ధరలో మార్పు ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot