Home
Computer

CES 2025 ఎలక్ట్రానిక్స్‌ షోలో గేమింగ్ ఉత్పత్తులను ఆవిష్కరించిన HP.. ఫీచర్‌ల వివరాలు..!

టెక్నాలజీ ప్రస్తుతం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. అనేక సంస్థలు సరికొత్త ఆవిష్కరణలతో అందుబాటులోకి వస్తున్నారు. ఇలాంటి అనేక ఆవిష్కరణలకు కన్య్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో 2025 (CES 2025) వేదికగా మారింది. ఈ అతి పెద్ద ఎలక్ట్రానిక్స్‌ షో లాస్‌ వెగాస్‌ లో ప్రారంభం అయింది. ఇవాళ్టి నుంచి 10 వ తేదీ వరకు జరగనుంది. ప్రముఖ సంస్థలు ఈ CES వేదికగా అనేక ఉత్పత్తులను ప్రదర్శన సహా ఆవిష్కరించనున్నాయి.

HP నుంచి కొత్త ఉత్పత్తులు :
ప్రముఖ సంస్థ HP ఈ ఎలక్ట్రానిక్స్‌ షో వేదికగా గేమింగ్‌ ఉత్పత్తులను ఆవిష్కరించింది. HP Omen AI మరియు HyperX తో కూడిన గేమింగ్ ల్యాప్‌టాప్‌ సహా స్మార్ట్‌ మానిటర్‌ ఇతర ఉత్పత్తులను విడుదల చేసింది. ఇంటెల్‌, AMD, Nvidia నుంచి GPU లతో ఈ పీసీలు అందుబాటులోకి రానున్నాయి.

HP unveiled New gaming laptops

ఈ CES 2025 లో ఓమెన్‌ AI ను HP లాంచ్‌ చేసింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత (AI) టూల్స్‌తో మెరుగైన పనితీరు కనబరుస్తుందని (HP Omen AI) సంస్థ చెబుతోంది. మెరుగైన గేమింగ్‌ ఫర్మామెన్స్‌ ను అందించే విధంగా ఓమెన్‌ AI హార్డ్‌వేర్‌, OS, గేమ్ సెట్టింగ్స్‌ ను విశ్లేషిస్తుందని HP చెబుతోంది. ప్రస్తుతం ఓమెన్‌ AI కౌంటర్‌ స్ట్రైక్‌ 2 కి మద్దతు ఇస్తోంది.

ఒమెన్‌ మ్యాక్స్ 16 ల్యాప్‌టాప్‌ :
కన్య్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షోలో HP Omen Max 16 ను ఆవిష్కరించింది. అత్యంత మెరుగైన పనితీరు అవసరం అయ్యే గేమర్స్‌కు ఇది అనుకూలంగా ఉంటుందని సంస్థ చెబుతోంది. ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా 9 లేదా AMD రైజన్‌ AI 9 ప్రాసెసర్‌ల ఆప్షన్‌లలో అందుబాటులోకి వస్తుంది. గ్రాఫిక్స్‌ టాస్క్‌ల సమయంలోనూ మెరుగైన పనితీరు కనబరుస్తుందని తెలిపింది. 64GB DDR5 ర్యామ్‌ను కలిగి ఉంటుంది.

Nvidia RTX 50 సిరీస్‌ GPU ల ద్వారా గ్రాఫిక్స్‌ పనితీరు (Omen Max 16 Laptop) మెరుగుపడుతుంది. DLSS 4 సపోర్టు, అడ్వాన్స్‌డ్‌ AI ను కలిగి ఉంటాయి. ఉష్ణోగ్రత నియంత్రణకు టెంపెస్ట్‌ కూలింగ్‌ ప్రో, ఓమెన్‌ కైరో కంఫౌండ్‌ డిజైన్‌ ను ఈ ల్యాప్‌టాప్‌ కలిగి ఉంటుంది. దీంతోపాటు మరిన్ని ఫీచర్‌ లు ఉన్నాయి.

షౌడో బ్లాక్‌, సిరామిక్‌ వైట్‌ :
ఓమెన్‌ మ్యాక్స్ 16 ల్యాప్‌టాప్‌ షౌడో బ్లాక్‌, సిరామిక్‌ వైట్‌ రంగుల్లో లభిస్తుంది. దీంతోపాటు హెచ్‌పీ అల్ట్రా లో లేటెన్సీ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. గేమింగ్ పరంగా మెరుగైన పనితీరును కనబరుస్తుందని HP చెబుతోంది. దీంతోపాటు ఓమెన్‌ 32x స్మార్ట్‌ గేమింగ్‌ మానిటర్‌ ను (HP Omen 32X) కూడా ఆవిష్కరించింది.

గేమింగ్‌ మానిటర్‌ :
ఈ స్మార్ట్‌ గేమింగ్‌ మానిటర్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో కూడిన 4K UHD డిస్‌ప్లేను కలిగి ఉంది. గూగుల్‌ టీవీను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు స్మార్ట్ హోమ్‌ యాప్స్‌, క్లౌడ్‌ గేమింగ్‌ను కూడా సపోర్టు చేయనుంది. గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం సరైన ఎంపిక కానుందని చెబుతోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
HP unveiled New gaming laptops with high performance in CES 2025 full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X