‘హెచ్ పీ’ వింత ప్రపంచం.. ‘టచ్ స్మార్ట్ 610 పీసీ’తో...!!

Posted By: Staff

‘హెచ్ పీ’ వింత ప్రపంచం.. ‘టచ్ స్మార్ట్ 610 పీసీ’తో...!!

అనగనగా, ఓ వినూత్న ప్రపంచం.., ఆ వింత విశ్వంలో అన్ని అద్భుతాలే.. రెప్ప మూయలేనంత ఆసక్తి.. మైమరచిపోయేంత అనుభూతి.. చూసే కొద్ది చూడాలన్న ఆత్రుత.. అబ్బా ఊహించుకుంటేనే.. గాల్లో తేలుత్తున్నట్లుంది కదండి..!! ఇలాంటి అనుభూతి కోసం పరితపించే సాంకేతిక ప్రేమికుల కోసం హివ్‌లెట్ - పేక్వర్డ్ (Hewlett-Packard) షార్ట్ కట్‌లో HP ‘టచ్ స్మార్ట్ 610 పీసీ’ పేరుతో ఓ వినూత్న కంప్యూటర్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

ఇక ఈ పీసీలోని అధునాతన ఫీచర్లను పరిశీలిస్తే మీకిక మనసాగదేమో.. విండోస్ 7 హోమ్ ప్రీమియం 64 ఆపరేటింగ్ వ్యవస్థ, ఈ వ్యవస్థను సపోర్టు చేసే ఇంటెల్ కోర్ i5-650, 3.2 GHz (జిగాహెడ్జి) ప్రాసెస్సర్లు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దకున్నాయి. మరో ప్రత్యేకత ఈ కంప్యూటర్లో దాగుందండయ్.. ‘టచ్ స్మార్ట్ 610 పీసీ’ డిస్‌ప్లే మొత్తం టచ్‌స్ర్కీన్ టైప్, ఈ సౌలభ్యతతో మీరు స్క్రీన్‌లోని డిస్‌‌ప్లేలో ఏ ఆకారంలో కావాలంటే ఆ ఆకారంలో డ్రాగ్ చేసుకోవచ్చు. ఈ మల్టీ టచ్ సౌలభ్యతతో డెస్క్‌టాప్‌ను మీకు కావల్సిన రీతిలో డెకరేట్ చేసుకోవచ్చు.

23 అంగుళాల వెడల్పు వైశాల్యం కలిగిన ఎల్ సీడీ డిస్‌ప్లే కాంతివంతమైన లుక్‌ నిస్తుంది. ఈ కంప్యూటర్‌లో పొందుపరిచిన మరిన్ని అదనపు ఫీచర్లు మిమ్మల్ని రా..రామ్మని ఆహ్వానిస్తాయి. ఈ కంప్యూటర్‌ని మీరు టీవీలా కూడా ఉపయోగించుకోవచ్చు. మీ ఫేవరెట్ ఛానళ్లను అద్భుతమైన అనుభూతితో వీక్షించవచ్చు. ఇందు కోసం ప్రత్యేకంగా రిమోట్ కంట్రోల్ కంప్యూటర్ అదనంగా లభిస్తుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే... మైక్రోఫోన్‌లో అమర్చిని ‘బుల్లి వీజీఏ (VGA)’ వెబ్ కామ్ ఉత్తమమైన వీడియో ఛాటింగ్ అనుభూతిని మీకు అందిస్తుంది.

‘హెచ్‌పీ టచ్ స్మార్ట్ 610’ పీసీని అత్యుత్తమ డిజైన్‌తో తీర్చిదిద్దారు. ఎం.ఎస్ ఆఫీస్ (MS office), సోషల్ నెటవర్కింగ్ (social networking), ఫేస్ బుక్ (Facebook), ట్విట్టర్ (Twitter) వంటి ఆప్లికేషన్లు ఈ పీసీలో ముందుగానే లోడ్‌ చేసి ఉంటాయి. ఒకవేళ మీకు ఏమైనా అదనపు ఆప్లికేషన్లు కావల్సి వస్తే దగ్గర్లో ఉన్న టచ్‌స్మార్ట్ ఆప్లికేషన్ సెంటర్‌కు వెళ్లి కొత్త వాటిని లోడ్ చేసుకోవచ్చు.

సరికొత్త టచ్ స్మార్ట్ 610 ద్వారా అంతరాయంలేని ఇంటర్నెట్ సదుపాయాన్ని మీరు పొందవచ్చు. ఇందుకుగాను పీసీలో పొందుపరిచిన సైమాన్టిక్ నార్టాన్ ఇంటర్నెట్ సెక్యూరిటి 2010 (Symantec Norton Internet Security 2010) 60 రోజుల లైవ్ అప్‌డేట్ మీ ఇంటర్నెట్ సెక్యూరిటీకి భరోసానిస్తుంది. పీసీలో పొందుపరిచిన ప్రత్యేక సాఫ్ట్ వేర్లు హెచ్‌పీ లింకప్ , హెచ్‌పీ మ్యూజిక్‌లు సంగీత ప్రియులకు మరింత అనుభూతిని అందిస్తాయి. ఎంటర్‌ టైన్‌మెంట్ అంశాలల్లో భాగంగా గేమింగ్ విషయానికి వస్తే పీసీలో పొందుపరిచిన హెచ్‌పీ గేమ్స్ మీకు ప్రత్యక్ష అనుభూతిని కలిగిస్తాయి.

ఇక వీడియో విషయానికి వస్తే ఇందులో పొందుపిరిచిన అత్యాధినిక సాఫ్టవేర్ ‘గ్రాఫిక్ సపోర్టు తో కూడికుని ఉన్న రంగుల ప్రపంచాన్ని మీకు అందిస్తుంది’. పీసీకి సంబంధిచి ప్రతి అంశలో పొందుపిరిచిన హై డెఫినిషన్ (hd) వ్యవస్థ నాణ్యమైన అనుబూతిని మీకు అందిస్తుంది. ఒక్క మాటాలో చెప్పాలంటే సకుటుంబ సపరివారసమేతంగా అందరూ వినియోగించదగ్గ అద్భుతమైన పరికరమిది. ఇక ధర విషయానకి వస్తే రూ.74,150 కాస్త ఎక్కువగానే అనిపించినా వినియోగదారునికి మాత్రం నూరు శాతం సంతృప్తినిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot