కస్టమర్ దేవుళ్లకు ‘హెచ్‌పీ వోమ్నీ’!!!

Posted By: Prashanth

కస్టమర్ దేవుళ్లకు ‘హెచ్‌పీ వోమ్నీ’!!!

 

టెక్ ప్రపంచాన్ని ఇటీవల కాలంలో ఆకర్షిస్తున్న ‘ఆల్ ఇన్ వన్ కంప్యూటర్’లు కస్టమర్ దేవుళ్లకు సైతం హాట్ ఫేవరేట్‌గా నిలుస్తున్నాయి. ఖచ్చిత్తమైన పనితత్వాన్ని ప్రదర్శించే ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ మరో విప్లవానికి నాంది కానుందని విశ్లేషక వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

కాలానుగుణంగా మారుతున్న ట్రెండ్‌లను అంచనావేస్తూ కొత్త ఆవిష్కరణలకు నాంది పలికే హివ్లెట్ ప్యాకర్డ్ (హెచ్‌పీ) ఓ సరికొత్త ఆల్ ఇన్ వన్ పీసీని డిజైన్ చేసింది. ‘హెచ్‌పీ వోమ్నీ 27’గా వస్తున్న ఈ డివైజ్ ఇంటెల్ కోర్ సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది.

ఈ పీసీ డిస్‌ప్లే 27 అంగుళాల పరిమాణం కలిగి అత్యుత్తమ రిసల్యూషన్‌తో రూపుదిద్దుకుంది. మీ ఎంపికను బట్టి డివైజ్‌లో ఇంటెల్ కోర్ i3 లేదా i3 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేస్తారు. సిస్టం మెమరీ 4జీబి, 8జీబి వేరియంట్‌లలో లభ్యమవుతుంది. డివైజ్ గ్రాఫిక్ కార్డ్ ఎంపికలోనూ రెండు ఛాన్సులున్నాయి. అవసరాన్ని బట్టి AMD లేదా NVIDIA గ్రాఫిక్ కార్డ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ పీసీ స్టోరేజి సామర్ధ్యం 3 TB వరుకు ఉంది. బీట్స్ ఆడియో వ్యవస్థను పీసీలో నిక్షిప్తం చేశారు.

వినియోగదారుడు తన సామర్ధ్యాన్ని బట్టి బ్లూ‌రే డ్రైవ్ లేదా టీవీ ట్యూనర్ కార్డ్‌ను డివైజ్‌లో ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే దీనికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. భారతీయ మార్కెట్లో ‘హెచ్‌పీ వోమ్నీ 27’ ధర మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting