మరిన్ని మోడళ్లతో Hewlett Packard..!!

Posted By: Super

మరిన్ని మోడళ్లతో Hewlett Packard..!!

ప్రపంచంలో అతిపెద్ద ‘కంప్యూటర్ పీసీ’ తయారీదారు Hewlett Packard (HP) భారతీయ desktop, laptop marketలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. ‘టెక్నో మార్కెట్లో’ అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన HP మరిన్ని మోడళ్లను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది.

ప్రస్తుత ఇండియన్ మార్కెట్లో పోటీ నెలకున్న నేపధ్యంలో HP పలు కొత్త ల్యాప్‌టాప్ మోడళ్లతో పాటు కంప్యూటర్ పరికరాలను విడుదలచేయునుంది. తాజాగా సంస్థ వర్గాలు HP ProBook M series, EliteBook P series Laptopలతో పాటు HP 2560p Docking station పరికరాన్నివిడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అధునాతన FORGE (Form Optimized Richness Green Endurance) డిజైన్లతో ఈ HP ల్యాప్‌టాప్‌లను రూపొందించారు.

‘HP Elite Book 2560p’, ‘HP ProBook 5330 M’ పేర్లతో రూపొందింపబడిన ఈ ల్యాప్‌టాప్ లు అత్యాధినిక సాంకేతికతతో రూపొందించబడ్డాయి. 12.5 inch high definition display సామర్థ్యం కలిగిన ‘HP Elite Book 2560p’ నాణ్యమైన visual అనుభూతిని మీకు అందిస్తుంది. ఇక ‘HP ProBook 5330 M’ విషయానికి వస్తే 11.5 inch high definition display సామర్థ్యం కలిగి dual-tone color scheme కలిగి ఉంటుంది. అత్యాధినిక పని తీరును కలిగి ఉన్న ఈ ల్యాప్‌టాప్‌ల బరువు మాత్రం 1.63 కిలోగ్రాములు ఉంటుంది.

‘HP ProBook 5330 M’లో మరో విశిష్టత దాగి ఉంది. ఈ మోడళ్లో ఆడియోకు సంబంధించి వ్యవస్థను ‘‘HP , Dr. Dre ’’ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అత్యుత్తమంగా రూపుదిద్దకున్న ఈ ‘Beats Audio’ వ్యవస్థ సంగీత ప్రియులకు మధురానుభూతులను కలిగిస్తుంది.

ఇక ‘HP 2560p Docking station’ విషయానికి వస్తే ఈ USB ports, VGA ports, HDMI ports మరియు eSATA ports వంటి అంశాలతో ఇమిడి ఉన్న ఈ అధునాతన పరికరం వ్యాపార వేత్తలకు మరింత ఉపయోగపడుతుంది. అయితే ల్యాప్‌టాప్‌ల ధరల విషయానికి వస్తే రూ.40,000 నుంచి రూ.80,000 పలుకుతున్నాయి. అయితే Docking station ధర మాత్రం తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot