Home
Computer

HP నుంచి స్పెషల్‌ ఎడిషన్‌ ల్యాప్‌టాప్‌.. 15.6 అంగుళాల డిస్‌ప్లే సహా కీలక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు..!

ప్రముఖ ల్యాప్‌టాప్‌ ల తయారీ సంస్థ HP తాజాగా స్పెషల్‌ ఎడిషన్‌ ల్యాప్‌టాప్‌ ను (HP Victus Special Edition Laptop) విడుదల చేసింది. విద్యార్థుల కోసం ఈ HP విక్టస్‌ ప్రత్యేక ఎడిషన్‌ ను లాంచ్ చేసినట్లు సంస్థ తెలిపింది. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా వీటిని తయారు చేసినట్లు తెలిపింది. వీడియో ఎడిటింగ్‌, గేమింగ్‌ సహా ఇతర అవసరాల కోసం Nvidia Geforce RTX 3050 A 4GB GPU ను కలిగి ఉంటుందని సంస్థ వెల్లడించింది.

ఈ HP ల్యాప్‌టాప్‌ లు (HP Student Edition Laptop) 12వ జెన్‌ Intel కోర్‌ ప్రాసెసర్‌ ను కలిగి ఉంటుంది. దీంతోపాటు మెరుగైన గేమింగ్‌ అనుభూతి కోసం Nvidia AI Tensor కోర్స్‌, DLSS టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ ల్యాప్‌ టాప్‌ గేమింగ్‌ సహా మెరుగైన బ్యాటరీ లైఫ్‌ ను అందిస్తుందని HP వెల్లడించింది.

HP Victus special edition laptop launched

HP విక్టస్‌ స్పెషల్ ఎడిషన్‌ ల్యాప్‌టాప్‌ స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ లు :
HP విక్టస్‌ స్పెషల్‌ ఎడిషన్‌ ల్యాప్‌టాప్‌ లు.. HP విక్టస్ 16 మోడల్‌ కు రీప్యాకేజ్‌ వెర్షన్‌ గా అందుబాటులోకి వచ్చాయి. ఈ ల్యాప్‌టాప్‌ 144Hz రీప్రెష్‌ రేట్‌తో 15.6 అంగుళాల పుల్ HD డిస్‌ప్లేను కలిగి ఉంది.

HP స్పెషల్ ఎడిషన్‌ ల్యాప్‌టాప్‌ 12వ జెన్‌ ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. ఉష్ణోగ్రత నియంత్రణకు IR థర్మోపైల్‌ సెన్సార్‌ తో కూడిన Omen బ్రాండ్‌ కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ కొనుగోలుతో HP గేమింగ్‌ గ్యారేజీ ను కూడా వినియోగించుకోవచ్చు.

ఈ HP ల్యాప్‌టాప్‌ 16GB ర్యామ్‌ తో అందుబాటులో ఉంటుంది. ఫలితంగా మల్టీ టాస్కింగ్‌ సమయంలోనూ సులభంగా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ స్పెషల్ ఎడిషన్‌ ల్యాప్‌టాప్‌ 70Whr బ్యాటరీతో పనిచేస్తుంది. ఫలితంగా ముఖ్యమైన టాస్క్‌ లో ఉన్నప్పుడు ఛార్జింగ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఈ ల్యాప్‌టాప్‌ బరువు 2.29kg లుగా ఉంది.

HP విక్టస్‌ స్పెషల్ ఎడిషన్‌ ల్యాప్‌టాప్‌ ధర, సేల్‌ వివరాలు :
HP విక్టస్‌ స్పెషల్‌ ఎడిషన్‌ ల్యాప్‌టాప్‌ అట్మాస్‌పియరిక్‌ బ్లూ రంగులో మాత్రమే లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ ధర రూ.65,999 గా ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేసిన వారికి రూ.499 కే హైపర్‌ క్లౌడ్ స్టింజర్‌ 2 హెడ్‌సెట్‌ ను అందిస్తున్నారు. HP వెబ్‌సైట్‌ సహా ఇతర స్టోర్‌ ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
HP Victus special edition laptop launched with Nvidia support for student needs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X