‘కంప్యూటర్ల వ్యాపరం నుంచి వైదొలగం’

Posted By: Staff

‘కంప్యూటర్ల వ్యాపరం నుంచి వైదొలగం’

న్యూయార్క్: పర్సనల్ కంప్యూటర్ల వ్యాపారం నుంచి వైదొలగాలా వద్దా అన్న అంశం పై తీవ్ర తర్జనభర్జనల అనంతరం ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీదారు హెవ్లెట్ ప్యాకర్డ్ (హెచ్‌పీ) పీసీల వ్యాపారం నుంచి నిష్క్రమించేది లేదని నిర్థారించుకుంది. సంస్థ వ్యూహాత్మక వ్యవస్థీకరణలో భాగంగా పీసీల వ్యాపరం నుంచి వైదొలగాలని కంపెనీ మాజీ సీఈవో ఆపోతేకర్ చేసిన సూచనను కూలంకషంగా పరిశీలించిన ‘హెవ్లెట్ ప్యాకర్డ్’ (పీఎస్‌జీ) పర్సనల్ సిస్టమ్ గ్రూప్‌ను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. పీఎస్‌జీ తమ వ్యాపారంలో కీలకమని హెచ్‌పీ అధ్యక్షుడు, సీఈవో మెగ్ విట్‌మన్ పేర్కొన్నారు. కంప్యూటింగ్ పరికరాల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ బ్రాండ్‌గా ‘హెచ్‌పీ’ గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot