సెప్టంబర్ 19వరకు సస్పెన్స్ తప్పదు?

Posted By: Prashanth

సెప్టంబర్ 19వరకు సస్పెన్స్ తప్పదు?

 

హచ్‌టీసీ డిజైన్ చేస్తున్న1080పిక్సల్ ఫాబ్లెట్‌కు సంబంధించి గత కొంత కాలంగా అనేక వార్తలు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలసిందే. తాజాగా ఈ డివైజ్‌కు సంబంధించి మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. హెచ్‌టీసీ సోర్స్ ఈ కీలక సమాచారాన్ని బహిర్గతం చేసింది. హెచ్‌టీసీ అభిమానుల అంచనాలను రెట్టింపు చేస్తున్న ఈ మల్టీ పర్పస్ గ్యాడ్జెట్ పేరు డ్రాయిడ్ ఇన్‌క్రెడిబుల్ ఎక్స్( Droid Incredible X)గా నామకరణం చేసినట్ల వ్యక్తమవుతున్న వివరాల ద్వారా తెలుస్తోంది.

ఫీచర్ల విషయానికొస్తే:

5 అంగుళాల టచ్ స్ర్కీన్(రిసల్యూషన్ సామర్ధ్యం1794x 1080పిక్సల్స్),

480 పీపీఐ డిస్‌ప్లే,

సెకండ్ జనరేషన్ ఎల్ఈడి,

క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,

1.5జీబి ర్యామ్,

16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

ఆపరేటింగ్ సిస్టం( ఆండ్రాయిడ్ జెల్లీబీన్ లేదా ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్).

బ్యాటరీ అదేవిధంగా ఎక్సటర్నల్ మెమరీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read In English

తెర పైకి మరో ప్రచారం..?

ఈ ఫాబ్లెట్ ఆవిష్కరణకు సంబంధించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. న్యూయార్క్ వేదికగా ఈ నెల 19న హెచ్‌టీసీ నిర్వహించబోయే ప్రత్యేక కార్యక్రమంలో డ్రాయిడ్ ఇన్ క్రెడిబుల్ ఎక్స్‌ను ప్రకటించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. హెచ్‌టీసీ వన్ ఎక్స్‌కు సక్సెసర్‌గా భావిస్తున్న హెచ్‌టీసీ డీఐఎక్స్ మార్కెట్లో ఏమేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot