స్టైలిష్ హిరో సెప్టంబర్ 18న..?

Posted By: Staff

 స్టైలిష్ హిరో సెప్టంబర్ 18న..?

స్టైలిష్ మొబైల్ మేకర్ హెచ్‌టీసీ సరికొత్త టాబ్లెట్‌ను ఆవిష్కరించబోతుంది. నెక్సస్ 7కు పోటీగా రూపుదిద్దుకుంటున్నఈ గ్యాడ్జెట్ సెప్టంబర్ 18న హెచ్‌టీసీ నిర్వహించబోయే ప్రత్యేక కార్యక్రమంలో ప్రదర్శనకు రాబోతుంది. ఓ ప్రముఖ టెక్‌పోర్టల్ సేకరించిన సమాచారం మేరకు హెచ్‌టీసీ ఫ్లయర్ 2గా విడుదల కాబోతున్న ఈ కొత్త టాబ్లెట్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి..

7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్),

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

ఎల్‌టీఈ ఇంటిగిరేషన్‌తో కూడిన 28ఎన్ఎమ్ స్నాప్‌డ్రాగెన్ చిప్‌సెట్,

3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

గతేడాది మార్కెట్లో విడుదలైన హెచ్‌టిసి ప్లయర్ ఫీచర్స్ విషయానికి వస్తే 7-inch డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1.5 GHz Qualcomm processorతో ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. వీటితో పాటు ప్రత్యేకంగా క్యాపబుల్ స్టయిల్స్, హెచ్‌టిసి సెన్స్ యుఐ ఉండడం విశేషం. ఇక దీని వెనుక భాగంలో 5మెగా ఫిక్సల్ కెమెరా కూడా ఉంది. ఇక ముందు భాగంలో 1.3మోగా ఫిక్సల్ కెమెరాతోపాటు, 4000 mAh బ్యాటరీ కలిగిఉంది. 3జీ కనెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇక మొమొరీ విషయానికి వస్తే 32జిబి ఇంటర్నల్ మొమొరి సౌకర్యం ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot