పోటాపోటీగా.. హెచ్ టీసీ, మోటరోలా..!!

Posted By: Super

పోటాపోటీగా.. హెచ్ టీసీ, మోటరోలా..!!

‘హెచ్‌టీసీ’ గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో అత్యుత్తమ సాంకేతిక పరికారాలను ప్రవేశపెడుతున్న బ్రాండ్.. ‘మోటరోలా’ భారతీయు వినియోగదారులచే గుర్తింపు పొందిన మరో బ్రాండ్... అత్యాధినిక పరిజ్ఞానంతో కూడిన టాబ్లెట్ పరికరాలను ఈ ఏడాది ఈ రెండు బ్రాండ్లు ప్రవేశపెట్టాయి. సమానమైన ఫీచర్లతో ఈ రెండు మోడళ్లు మార్కెట్లో హిట్ కొట్టటంతో, ఏ బ్రాండ్ టాబ్లెట్‌ను ఎంపిక చేసుకోవాలో తెలియక కొనుగోలుదారులు డైలమాలో పడుతున్నారు.

జింజర్ బోర్డు ఆపరేటింగ్ వ్యవస్థ 2.3 వర్షన్ ఆధారితంగా పని చేసే ‘ హెచ్‌టీసీ ఫ్లయర్ ’(HTC Flyer), సరికొత్త ఆండ్రాయిడ్ హనీకూంబ్ ఆపరేటింగ్ వ్యవస్థ 3.0 వర్షన్ ఆధారితంగా పనిచేసే ‘మోటరోలా జ్యూమ్’ (Motorola Xoom) టాబ్లెట్ పీసీల మధ్య గట్టి పోటీ నెలకుంది.

ఈ టాబ్లెట్ పీసీలలోని ప్రత్యేకతలను పరిశీలిస్తే... హెచ్‌టీసీ 15.5 జిగాహెడ్జ్ (GHz) క్వాల్‌కమ్ ప్రాసెస్సర్ కలిగి ఉంది. ఆల్యూమినియం యునీబాడీ డిజైన్‌తో రూపుదిద్దకున్న ‘హెచ్‌టీసీ టాబ్లెట్ పీసీ’లు జీఎస్ఎమ్ (GSM) 2జీ వ్యవస్థ, హెచ్‌ఎస్‌డీ‌పీఏ (HSDPA) 3జీ వ్యవస్థలను సహకరించే విధంగా రూపొందించారు. ఈ టాబ్లెట్‌లో హ్యాండ్ రైటింగ్ సపోర్టు చేసే విధంగా ఆండ్రాయిడ్ వ్యవస్థను రూపొందిచారు. అయితే మీరు స్ర్ర్కీన్‌పై రాసేందుకు ‘మ్యాజిక్ పెన్ను’ను ఈ టాబ్లెట్‌తో పొందవచ్చు. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే హెచ్ టీసీ 7 అంగుళాల ఎల్‌సీడీ సామర్థ్యం కల టచ్ స్ర్కీన్ స్వభావం కలిగి ఉంది. అయితే స్ర్కీన్ పిక్సల్ రిసల్యూషన్ 600 X 1024 కలిగి ఉంటుంది.

ఇక ‘మోటరోలా గ్జూమ్’లోని ఫీచర్లను పరిశీలిస్తే న్విడీయా (NVIDIA) టెగ్రా 2 AP20H డ్యూయల్ ప్రాసెస్సర్ కలిగి ఉంది. ఈ టాబ్లెట్‌లో పొందుపరిచిన HDMI port, USB Host వంటి హార్డ్‌వేర్ అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అనుసంధానించిన 5 మోగా పిక్సల్ కెమెరా హై రిసల్యూషన్ కలిగి నాణ్యమైన చిత్రాల తీసుకునేందుకు ఉపకరిస్తుంది. ఇందులో పొందుపరిచిన డ్యూయల్ బ్యాండ్ వై - ఫై 802.11 కెనెక్టువిటీ, వై - ఫై హాట్‌స్పాట్ వంటి అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

అయితే ‘మే’లో మార్కెట్లో విడుదలైన ‘ హెచ్‌‌టీసీ ఫ్లయర్‌’ కు మాత్రం ఊహించని డిమాండ్ నెలకుందని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ టాబ్లెట్‌లో పొందుపరిచిన అత్యాధినిక ఫీచర్లు ప్రత్యేకంగా ఆకట్టకుంటున్నాయని పలువురు కోనుగోలుదారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత మార్కెట్లో ‘హాట్ కేకుల్లా’ అమ్ముడవుతున్న ‘హెచ్‌టీసీ ఫ్లయిర్‌’కు డిజిటిల్ కంపాస్, గుగూల్ సెర్చ్ మ్యాప్స్ వంటి అంశాలు ఫ్లస్ పాయింట్లు నిలిచాయంటున్నారు. అయితే ‘మోటరోలా జ్యూమ్‌’తో పోలిస్తే మార్కెట్ లో రూ.25990 లభ్యమవుతున్న ‘హెచ్‌టీసీ ఫ్లయిర్’ బెస్ట్ ఛాయిస్ అంటూ విశ్లేషకులు మార్కులు వేస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot