ఆశల పల్లకిలో ‘హెచ్ టీసీ’ , ‘వ్యూప్యాడ్’..?

Posted By: Staff

ఆశల పల్లకిలో ‘హెచ్ టీసీ’ , ‘వ్యూప్యాడ్’..?

విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్న హెచ్‌టీసీ ఫ్లైయర్, వ్యూప్యాడ్ టాబ్లెట్ పీసీలు, గెలుపు ఎవరిని వరిస్తుందోనని ‘ఆశలు పల్లకి’లో విహరిస్తున్నాయి. సమాన కాన్పిగరేషన్లతో రూపుదిద్దుకున్న ఈ టాబ్లెట్ పరికరాలు తమ సత్తాను చాటుకునేందుకు అతి త్వరలో వినియోగదారుల ముందుకు రానున్నాయి.

వీటి ఫీచర్లను సమీక్షిస్తే 7 అంగుళాల డిస్‌ప్లే సామర్ధ్యం గల హెచ్‌టీసీ ఫ్లేయర్ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బోర్డు ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారింతంగా రూపుదిద్దుకోగా, ‘వ్యూప్యాడ్’ విండోస్ ఆండ్రాయిడ్ 2.2 ఆపరేటింగ్ వ్యవస్థ ద్వారా పనిచేస్తుంది. వీటిలోని ప్రొసెసింగ్ అంశాలను పరిశీలిస్తే హెచ్‌టీసీలో పొందుపరిచిన 1.5 GHz ప్రసొసెర్ సమర్ధవంతమైన పని తీరును కలిగి ఉంటుంది. ‘వ్యూప్యాడ్ 10’లో పొందుపరిచిన ప్రొసెసింగ్ వ్యవస్థను పరిశీలిస్తే ఇంటెల్ ఆటమ్ N455 / 1.66 ప్రొసెసర్ మన్నికైన పనితీరును ప్రదర్శిస్తుంది.

మెమరీ అంశాలను పరిశీలిస్తే హెచ్‌టీసీ ఫ్లైయర్ ముందు చూపుతో వ్యవహరించింది. 32జీబీ ఇంటర్నల్ స్టోరేజి వ్యవస్థను కలిగి ఉండటంతో పాటు అదనంగా ఎక్సటర్నల్ స్లాట్ విధానం ద్వారా జీబీని మరో 32కు వృద్థి చేసుకోవచ్చు. ‘వ్యూప్యాడ్’లో పొందుపరిచిన సాధారణ వ్యవస్థ ద్వారా కేవలం 32 జీబీకే పరిమితమవుతుంది.

కనెక్టువిటీ అంశాలను పరిశీలిస్తే, ఈ రెండు టాబ్లెట్లలో 802.11 b/g/n వై - ఫై వ్యవస్థతో పాటు అధునాతన బ్లూటూత్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ‘వ్యూప్యాడ్ 10’లోని ప్రత్యేకాంశాలను పరిశీలిస్తే ఇ - రీడర్, ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్లికేషన్ అంశాలను ఆడోబ్ ఫ్లాష్ సపోర్టు వ్యవస్థ ద్వారా నిర్వహించుకోవచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలకు పూర్తి ప్రాధాన్యతనిచ్చిన ఈ టాబ్లెట్లు త్వరలో భారతీయ మార్కెట్లో విడుదల కానున్నాయి. వీటి ధరలను పరిశీలిస్తే హెచ్‌టీసీ ఫ్లైయిర్ ధర రూ.35,500 మధ్య ఉంటుంది. ‘వ్యూప్యాడ్’ ధర తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot