‘జెట్’ ప్రపంచంలో విహరించండిలా..

Posted By: Super

‘జెట్’ ప్రపంచంలో విహరించండిలా..

‘‘ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీదారు హెచ్‌టీసీ ఫ్లైయిర్, తన కొత్త ఎడిషిన్ టాబ్లెట్లతో మార్కెట్లో హడావుడి సృష్టించేందుకు సిద్ధమవుతంది. అత్యుత్తమ కాన్ఫిగరేషన్ ఫీచర్లతో ‘జెట్‌స్ట్రీమ్’ టాబ్లెట్లను మార్కెట్లో విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తుంది. హెచ్‌టీసీ విడుదల చేసిన మునుపటి టాబ్లెట్ పీసీ ప్రపంచ వ్యాప్తంగా హిట్ కొట్టిన విషయం తెలిసిందే. విజయోత్సాహంలో ఉన్న బ్రాండ్ తాజాగా విడుదల చేయుబోతున్న ‘జెట్ స్ట్రీమ్’ వినియోగదారులను మరింత ఆకట్టకుంటుందని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.’’

టాబ్లెట్ ఫీచర్లను పరిశీలిస్తే:

అపడేటడ్ ఆండ్రాయిడ్ 3.1 ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా టాబ్లెట్ రూపుదిద్దుకుంది, 10.10 అంగుళాల వైశ్యాల్యం కలిగిన డిస్‌ప్లే వ్యవస్థ టచ్‌స్ర్కీన్ మరియు మల్టీ‌టచ్, లైట్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది.

పటిష్టమైన స్నాప్ డ్రాగన్ డ్యూయల్ కోర్ వ్యవస్థ ఈ గ్యాడ్జెట్‌లో దర్శనమిస్తుంది. మెమరీ విషయానికొస్తే 32 జీబీ ఇంటర్నెల్ మెమరీ అదనంగా కావల్సివస్తే ఎక్సటర్నల్ మైక్రో‌స్లాట్ విధానం ద్వారా మరో 32 జీబీకి వృద్ధి చేసుకోవచ్చు.

శక్తివంతమైన వై - ఫై, బ్లూటూత్ అంశాలు డేటాను మరింత వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. కెమెరా అంశాలను పరిశీలిస్తే 8 మెగా పిక్సల్ రేర్, 1.3 మెగా పిక్సల్ కెమెరాలు నాణ్యమైన వీడియోలతో పాటు చిత్రాలను అందిస్తాయి.

ఏర్పాటు చేసిన ఆడియో ఫ్లేయర్ విన సొంపైన సంగీతాన్ని శ్రోతకు అందిస్తుంది. పొందుపరిచిన యూ‌ట్యూబ్ ప్లేయర్ ద్వారా ఆనలైన్ స్ట్రిమింగ్ లైవ్ వీడియోలను తిలకించవచ్చు. ఇండియన్ మార్కెట్లో, సెప్టంబర్‌లో విడుదల కాబోతున్న ఈ టాబ్లెట్ పీసీ ధర రూ. 31, 500 ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot