రూమర్: కొత్త ప్రాజెక్ట్ చేస్తున్న స్టైలిష్ హిరో!

Posted By: Prashanth

రూమర్: కొత్త ప్రాజెక్ట్ చేస్తున్న స్టైలిష్ హిరో!

 

స్మార్ట్‌ఫోన్‌ల నిర్మాణంలో స్టైలిష్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న హెచ్‌టీసీ ఓ సరికొత్త టాబ్లెట్ పీసీని డిజైన్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటివరకు హెచ్‌టీసీ నుంచి ఏ విధమైన ప్రకటన వెలువడలేదు. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం... ఈ టాబ్లెట్ పీసీ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంను కలిగి ఉంటుంది. స్పెసిఫికేషన్‌లకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. ఈ డివైజ్‌ను ‘హెచ్‌టీసీ ఫ్లయిర్’కు సక్సెసర్ మోడల్‌గా రూపొందిస్తున్నారా..? లేక ఐప్యాడ్, గుగూల్ నెక్సస్ 7లకు పోటీగా డిజైన్ చేస్తున్నారా..? అనే అంశం పై స్పష్టత రావల్సి ఉంది.

క్వర్టీకి బై..బై?

క్వర్టీ కీప్యాడ్ ఫోన్ల తయారీని నిలుపుదల చేస్తున్నట్లు హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ హెచ్‌టీసీ సంచలన ప్రకటన చేసిందని విశ్వసనీయ వర్గాలు ఉటంకించాయి. సియాటిల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కంపెనీ డిజైన్ టీమ్ భవిష్యత ప్రణాళికలో భాగంగా ఈ వివరాలను వెల్లడించినట్లు సమాచారం. క్వర్టీ హార్డ్‌వేర్ వ్యవస్థతో పనిచేసే పలు ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లను హెచ్‌‌టీసీ డిజైన్ చేసింది. మార్కెట్లో ఆశాజనకమైన ఫలితాలు రాకపోవటంతో ఈ డిజైన్ ప్లాన్ నుంచి విరమించుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. హెచ్‌టీసీ తీసుకున్న నిర్ణయం ఏలా ఉన్నప్పటికి, ఈ చర్య పట్ల అభిమానులు ఆసంతృప్తికి లోనవుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot