హెచ్‌టీసీ 2012లో విడుదల చేస్తున్న తాజా టాబ్లెట్ ఫీచర్లేంటి..?

Posted By: Prashanth

హెచ్‌టీసీ 2012లో విడుదల చేస్తున్న తాజా టాబ్లెట్ ఫీచర్లేంటి..?

 

స్మార్ట్ ఫోన్ల తయారీలో ముందంజలో ఉన్న హెచ్‌టీసీ (HTC) తాజాగా టాబ్లెట్ పీసీల సెగ్మంట్ పై కన్నేసింది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన టాబ్లెట్ పీసీని 2012లో విడుదల చేసేందుకు బ్రాండ్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటి వరకు ఈ తైవాన్ బ్రాండ్ హెచ్‌టీసీ జెట్ స్ర్టీమ్ (HTC Jetstream), హెచ్‌టీసీ ఫ్లయిర్ (HTC Flyer) వేరియంట్లలో టాబ్లెట్ పీసీలను విడుదల చేసి ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే.

వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ఈ సరికొత్త టాబ్లెట్ పీసీ ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లుకు సంబంధించి హెచ్ టీసీ ఏ విధమైన ప్రకటన చేయలేదు. విశ్వసనీయంగా తెలియవచ్చిన సమాచారం మేరకు సరికొత్త ఫీచర్లతో ఈ టాబ్లెట్ రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది..

క్లుప్తంగా ఫీచర్లు:

- ఆండ్రాయిడ్ వర్షన్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

- సెన్స్ యూజర్ ఇంటర్ ఫేస్ సౌలభ్యత,

- వినియోగదారుడికి పూర్తి స్థాయిలో లబ్ధి చేకూర్చే విధంగా ఈ టాబ్లెట్ పీసీ ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది.

- భారతీయ మార్కెట్లో ఈ టాబ్లెట్ ధర మరియు ఇతర స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot