సీక్రెట్‌గా చర్చలు.. టార్గెట్ ఎవరు?

Posted By: Super

సీక్రెట్‌గా చర్చలు.. టార్గెట్ ఎవరు?

 

విండోస్ ఆధారితంగా స్పందించే ట్యాబ్లెట్ పీసీల పై హెచ్‌టీసీ దృష్టిసారించినట్లు బ్లూమ్‌బర్స్ తాజా నివేదికలు వెల్లడించాయి. వాయిస్ కాలింగ్ ఫీచర్ ప్రధానకర్షణంగా 12, 7 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లలో రహస్యంగా రూపుదిద్దుకుంటున్నఈ పోర్టబుల్ విండోస్ కంప్యూటింగ్ డివైజ్‌లు ఆపిల్ ఐప్యాడ్‌లతో తలపడగలవని సదరు నివేదిక స్పష్టం చేస్తోంది. క్వాల్కమ్ చిప్‌లతో పాటు విండోస్ ఆర్‌టి వర్షన్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌లను ట్యాబ్లెట్‌లలో వినియోగించినట్లు తెలుస్తోంది. 2013, క్వార్టర్ 3 నాటికి ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

అదిరిపోయే 30 పెన్‌డ్రైవ్‌లు(గ్యాలరీ)!

ఫిబ్రవరిలో ‘హెచ్‌టీసీ ఎమ్7’.....

తైవాన్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హెచ్‌టీసీ తన కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్ హెచ్‌టీసీ ఎమ్7ను ఫిబ్రవరిలో నిర్వహించే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తుంది. 1080 పిక్సల్ డిస్‌ప్లే రిసల్యూషన్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 4.7 అంగుళాల స్ర్కీన్ తో రూపుదిద్దుకుంది. మార్కెట్లో లభ్యమవుతన్న ఇతర స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే ఈ ఫోన్ రిసల్యూషన్ 40 శాతం అధికం. హ్యాండ్‌సెట్ ముందుభాగంలో ఏర్పాటు చేసిన 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (1080 పిక్సల్ రిసల్యూషన్) వినియోగదారులకు మన్నికైన వీడియో రికార్డింగ్‌ను అందిస్తుంది. ఫోన్‌లో వినియోగించిన 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ కెమెరా, ఎల్‌టీఈ చిప్స్, బీట్స్ ఆడియా టెక్నాలజీ, కొత్త జనరేషన్ వై-ఫై స్టాండర్డ్స్, 1.7గిగిహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌లు కొత్త తరహా మొబైలింగ్ అనుభూతులకు లోను చేస్తాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot