ఇండస్ట్ర్రీ వర్గాల్లో కోడైకూస్తున్న టాక్..?

Posted By: Super

ఇండస్ట్ర్రీ వర్గాల్లో కోడైకూస్తున్న టాక్..?

 

‘‘గ్యాడ్జెట్ ప్రపంచంలో ఓ తాజా వార్త ఇండస్ట్ర్రీ వర్గాల చుట్టూ చెక్కర్లు కొడుతుంది... 2012లో చోటుచేసుకోబోతున్న ఈ ఆవిష్కరణకు సంబంధించి ఇప్పటి నుంచే అంచనాలు ఊపందుకున్నాయి.’’

ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీదారు ‘హెచ్‌టీసీ’(HTC) అత్యాధునిక టాబ్లెట పీసీని మార్కెట్లో విడుదల చేసేందకు సన్నాహాలు చేస్తుంది. ‘హెచ్‌టీసీ క్వాట్రా’ వర్షన్లో విడుదలవుతున్న ఈ అత్యాధునిక టాబ్లెట్ పీసీ ‘న్విడియా’ (NVIDIA) టెక్నాలజి కలయకతో మరింత బలోపేతమయ్యింది.

క్లుప్తంగా ‘హెచ్ టీసీ క్వాట్రా’ ఫీచర్లు:

- డిస్ ప్లే 10.1 అంగుళాలు, స్క్రీన్ రిసల్యూషన్ 1280 x 768 పిక్సల్స్,

- ఆండ్రాయిడ్ 4.0 ఆడ్వాన్సడ్ ఆపరేటింగ్ సిస్టం,

- AP30 టెగ్రా 3 ప్రాసెసర్,

- శక్తివంతమైన న్విడియా (NVIDIA) చిప్ సెట్,

- హై డెఫినిషన్ వీడియో సౌలభ్యత,

- 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

- ర్యామ్ సామర్ధ్యం 1జీబి,

- 16జీబి ఇంటర్నెట్ మెమరీ,

- ఆడ్వాన్సడ్  బ్లూటూత్ వర్షన్ 4.0, 5 GHz సామర్ధ్యం గల వై-ఫై వ్యవస్థలు కనెక్టువిటీ వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తాయి.

- డిజిటల్ పెన్ అవుట్ పుట్ వ్యవస్థ ఈ టాబ్లెట్ పీసీకి ప్రత్యేక ఆకర్షణ,

- ధరకు సంబంధించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot