మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఆ గుట్టు రట్టు..?

Posted By:

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఆ గుట్టు రట్టు..?

 

ఈ నెల 27 నుంచి నాలుగు రోజులు పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనునన్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌కు బార్సిలోనా నగరం ముస్తాబైంది. ప్రముఖ గ్యాడ్జెట్ కంపెనీల ప్రతినిధులు ఈ భారీ ఈవెంట్‌కు హాజరై తమ తమ తాజా ఆవిష్కరణలను ప్రదర్శిస్తారు. ఈ వేడకకు హాజరయ్యే కంపెనీలలో హువావీ కూడా ఉండవచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ బ్రాండ్ తాజాగా రూపొందించిన 10 అంగుళాల టాబ్లెట్ కంప్యూటర్‌ను ఈ కార్యక్రమంలో ప్రదర్శించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమచారం. హువావీ డిజైన్ చేసిన టాబ్లెట్‍‌కు సంబంధించి పలు ఫీచర్లు వెబ్‌లో హల్ చల్ చేస్తున్నాయి వాటి వివరాలు:

* 10 అంగుళాల స్ర్కీన్,

* గుగూల్ ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

* 3జీ కనెక్టువిటీ,

* 8 మెగా పిక్పల్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్‌ఈడీ ఫ్లాష్),

ఈ డివైజ్ కు సంబంధించిన పూర్తి సమాచారం మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ద్వారా వెల్లడయ్యే అవకాశం ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot